ఇడ్లీ , దోశెలు , గారెలు , పూరీలు , రోటీలు మరియు చపాతీల లోకి మూడు నిముషాల్లో తయారు చేసుకునే పండుమిరపకాయలతో చట్నీ.
******************************
ఆలూరుకృష్ణప్రసాదు .
తయారీ విధానము .
మూడు స్పూన్లు పండు మిరపకాయల పచ్చడి ( కొరివి కారం ) తీసుకోండి .
పండు మిరపకాయల పచ్చడిలో తయారు చేసేటప్పుడే ఉప్పు , చింతపండు , ఇంగువ మరియు మిరపకాయల కారము ఉంటాయి .
మళ్ళీ ప్రత్యేకంగా ఏవీ వేయవలసిన అవసరం ఉండదు .
ఈ పండుమిరపకాయల పచ్చడి మరియు గరిటె పెరుగు మిక్సీ లో వేసి మెత్తగా మిక్సీ వేసుకోండి .
తర్వాత ఈ చట్నీ వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి , నెయ్యి బాగా కాగగానే వరుసగా రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , స్పూను చాయమినపప్పు , అర స్పూను ఆవాలు మరియు కరివేపాకు వేసి పోపు వేసుకుని , ఈ పోపు చట్నీలో వేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే పండు మిరపకాయల చట్నీ సర్వింగ్ కు సిద్ధం .
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.
0 comments:
Post a Comment