ఆలూరుకృష్ణప్రసాదు .
దొండకాయ రోటి పచ్చడి . ( పచ్చి దొండకాయలు )
దొండకాయలు -- పావు కిలో
చింతపండు -- నిమ్మకాయంత . కొద్దిగా నీటిలో తడిపి ఉంచుకోవాలి .
పచ్చిమిరపకాయలు -- 6
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
కొత్తిమీర -- ఒక చిన్న కట్ట.
పోపునకు .
నూనె -- అయిదు స్పూన్లు
ఎండుమిరపకాయలు - 6
చాయమినపప్పు -- స్పూను
మెంతులు -- పావు స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
దొండకాయలు ముక్కలుగా తరుగు కోవాలి .
స్టౌ మీద బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే దొండకాయ ముక్కలు , పసుపు మరియు పచ్చి మిర్చి వేసి మూతపెట్టి పది నిముషాలు మగ్గనిచ్చి వేరే పళ్ళెంలో తీసుకోవాలి .
తర్వాత తిరిగి బాండీ పెట్టి మిగిలిన రెండు స్పూన్లు నూనె వేసుకుని వరుసగా మెంతులు , ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు మరియు ఇంగువ వేసుకుని పోపు వేయించుకోవాలి .
తర్వాత రోటిలో వేయించిన పోపు , సరిపడా ఉప్పు మరియు తడిపిన చింతపండు వేసుకుని పచ్చడి బండతో మెత్తగా దంపు కోవాలి .
తర్వాత వేయించిన దొండకాయ ముక్కలు , కొత్తిమీర వేసుకుని కచ్చాపచ్చాగా పచ్చడి బండతో నూరుకుని వేరే గిన్నెలోనికి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చడి దోశెలు , చపాతీలు , రోటీలు , గారెలు మరియు భోజనము లోకి సిద్ధం.
0 comments:
Post a Comment