ఆలూరుకృష్ణప్రసాదు .
చాయపెసరపప్పు , పచ్చికొబ్బరి మరియు మామిడి కాయ ముక్కలతో పచ్చడి .
కావలసినవి .
చాయపెసరపప్పు -- 50 గ్రాములు .
రెండు గంటల సేపు తగినన్ని నీరు పోసి నానబెట్టుకుని వడకట్టుకోవాలి .
పచ్చి కొబ్బరి -- అర చిప్ప .
చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
పుల్లని పచ్చి మామిడి కాయ -- సగం కాయ .
పై చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
ఎండుమిరపకాయలు - 8
జీలకర్ర -- స్పూను
పచ్చి ఇంగువ -- పావు స్పూనులో సగం .
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు ( వేయించనవసరం లేదు ) , జీలకర్ర , పసుపు , పచ్చి ఇంగువ మరియు తగినంత ఇంగువ వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తరువాత పచ్చి కొబ్బరి ముక్కలు , మామిడి కాయ ముక్కలు మరియు నానబెట్టిన చాయపెసరపప్పు ను కూడా మిక్సీ లో వేసుకుని మధ్యలో కొద్దిగా నీళ్ళు పోసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
తర్వాత స్టౌ మీద పోపు గరిటెను పెట్టుకుని మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని మూడు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , స్పూను చాయమినపప్పు , అర స్పూను ఆవాలు మరియు రెండు రెమ్మలు కరివేపాకును వేసి పోపు పెట్టుకుని పచ్చడిలో కలుపుకోవాలి .
ఈ పచ్చడి లో కొబ్బరి ముక్కలు మరియు మామిడి కాయ ముక్కలు వేస్తాము కనుక భోజనము లోకే కాకుండా ఇడ్లీ మరియు దోశెల లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది .
హామీ పత్రం .
సంబంధిత ఫోటో మరియు రెసిపీ నా స్వంతం.
0 comments:
Post a Comment