ఆలూరుకృష్ణప్రసాదు .
మునక్కాడ ఆవకాయ .
ములక్కాడలు కొద్దిగా ముదురుగా గింజతో ఉండాలి . --- 4
అంగుళంన్నర ముక్కలుగా తరుగు కోవాలి .
నూనె --- 100 గ్రాములు .
చింతపండు -- 75 గ్రాములు .
విడదీసుకుని వేడి నీళ్ళల్లో ఒక అరగంట నానబెట్టుకుని చిక్కగా పులుసు తీసుకుని స్టౌ మీద బాగా ఉడక పెట్టుకోవాలి .
కారం -- అయిదు స్పూన్లు .
మెంతి పిండి -- స్పూను .
ఆవపిండి -- రెండు స్పూన్లు
మెత్తని ఉప్పు -- మూడు స్పూన్లు .
పసుపు -- అర స్పూను .
మెంతులు -- అర స్పూను .
తయారీ విధానము .
ముందుగా కారము , మెంతిపిండి , ఆవపిండి ఈ మూడు మరియు మెత్తని ఉప్పు ఒక చిన్న బేసిన్ లో వేసుకుని ఆవకాయకు మాదిరిగా చేతితో బాగా కలుపుకోవాలి .
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండి పెట్టి షుమారు 50 గ్రాముల నూనె వేసి నూనె బాగా కాగగానే అందులో అర స్పూను మెంతులు వేసి మెంతులను కొద్దిగా వేగనిచ్చి అందులో మునక్కాడ ముక్కలను వేసి బాగా ముక్కలను బాగా వేగ నివ్వాలి .
ఆ తర్వాత ముక్కలను బాగా చల్లార నివ్వాలి .
తర్వాత ఉడికించి చల్లారిన చిక్కని చింతపండు రసము , అన్నీ కలిపిన మిశ్రమము , పసుపు వేసి బాగా గరిటెతో కలుపుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే ఒక ఆరు ఎండుమిరపకాయలు , స్పూను ఆవాలు మరియు కొద్దిగా ఇంగువ వేసి పోపు బాగా చల్లారాక ఆవకాయలో కలిపి ఓ మూడు గంటల పాటు పిండి ముక్కలు ఊర నిచ్చి తర్వాత జాడీలోకి తీసుకోవాలి .
వెల్లుల్లి ఇష్టమైన వారు ఇంగువ బదులుగా పై తొక్క వలిచిన ఓ 30 వెల్లుల్లి రెబ్బలు పోపులో వేసుకుని వేగనిచ్చి చల్లారాక ఆవకాయలో కలుపుకోవచ్చు .
మేము ఇంతవరకు ఈ మునక్కాయ ఆవకాయ పెట్టలేదు . మొదటిసారిగా కొద్దిగా వెల్లుల్లి వేయకుండా పెట్టుకున్నాము .
రుచి బాగానే ఉంది .
ఇష్టమైన వారు ప్రయత్నించండి .
షుమారు ఓ రెండు నెలలు నిల్వ ఉంటుందనుకుంటాను .
ఈ మునగావకాయ భోజనము లోకి మరియు చపాతీల లోకి కూడా రుచిగా ఉంటుంది.
0 comments:
Post a Comment