ఆలూరుకృష్ణప్రసాదు .
ఆవకాయ. ( ఏడాది ఊరగాయ )
ఇప్పుడు ఆవకాయల సీజన్ .
అందరూ అదే పనిలో బిజి బిజీ .
మరి ఆవకాయ ఎలా పెట్టు కోవాలో మన సభ్యులందరికీ తెలియచేస్తున్నాను.
తయారీ విధానము .
అవకాయ .
మామిడి కాయను సైజును , పులుపును బట్టి కొలతలు కొంచెం అటుఇటుగా ఉంటాయి
మామిడికాయలు - 12
As బ్రాండ్ పప్పు నూనె - one and half kg
పసుపు -- ఒక స్పూను
మెంతులు -- మూడు స్పూన్లు
కొంతమంది శనగలు , మరి కొంతమంది వెల్లుల్లి రెబ్బలు ఆవకాయ లో కలిపేటప్పుడు వేసుకుంటారు .
ఈ శనగలు , వెల్లుల్లి రేకలు మీ మీ ఇష్టాన్ని బట్టి షుమారుగా వేసుకోవచ్చు .
ముందుగా మామిడికాయలు బజారు నుంచి తెచ్చి నీటిలో వెయ్యాలి .
కొద్దిసేపు ఒక బకెట్ లో ఉంచిన తరువాత ఒక్కొక్క కాయను గుడ్డతో
తుడిచి ముచ్చికలు తీసి పెచ్చుతో సహా ముక్కలుగా కట్ చేసుకోవాలి .
తరువాత ఒకొక్క ముక్కను గుడ్డ పెట్టి తుడిచి అందులో పల్చటి పొరను తీసెయ్యాలి .
ఇప్పుడు ప్రతి ఊరిలోనూ ఏ రకం కాయ కావాలో మనం ఎన్నుకుంటే వాళ్ళే నీళ్ళల్లో కడిగి , గుడ్డ పెట్టి కాయను తుడిచి ఆవకాయ కత్తి పీటతో కాయ చితకకుండా , పెచ్చుతో సహా ముక్కలుగా కట్ చేసి ఇస్తున్నారు .
దాని నిమిత్తం కాయకు ఇంతని వసూలు చేస్తున్నారనుకోండి .
ఇప్పుడు ఒక బేసిన్ లో మొత్తము నూనె పోసుకుని తరిగి సిద్ధంగా ఉంచుకున్న ముక్కలను నూనెలో వేయాలి.
అలా కొద్దిసేపు నూనె అంతా ముక్కలకు పట్టేటట్లు ఉంచాలి .
ఈ విధంగా నూనె లో ముక్కలను వెయ్యటం వలన సంవత్సరము అంతా ముక్క గట్టిగా ఉంటుంది .
ముక్క మెత్తగా అవ్వదు.
ఇప్పుడు ఓ పళ్ళెంలో అవ పిండి , ఉప్పు , కారం , పసుపు , మెంతులు వేసి కలిపి గుచ్చు ఎత్తుకోవాలి
ఇందాక నూనెలో వేసిన ముక్కలు కు ఈ మిశ్రము కలిపి బాగా చెక్క గరిటెతో కానీ చేతి తో బాగా కలుపుకోవాలి
ఒక జాడీలో పెట్టుకుని ఒక గుడ్డ వాసము కట్టాలి.
మూడవ రొజు తిరగ కలపాలి.
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి .
లోగడ పెద్ద వారందరూ ఈ ఏడాది ఆవకాయ తిరగ కలపటానికి , మధ్యలో కొంచెం కొంచెం విడిగా తీసుకోవడానికి చెక్క గరిటెలు వాడేవారు.
తిరిగి మళ్ళీ గుడ్డతో వాసిన కట్టే వారు.
ఇలా చేయడం వలన ఏటి కేడాది ఆవకాయ రంగు మారకుండా ఘమ ఘమ లాడుతూ ఉండేది .
ఆవకాయ లో కలిపే ఆవపిండి పాళ్ళు వివరంగా ఇస్తున్నాను .
ముక్కలు షుమారుగా కొలుచుకుని అంటే మూడు కే. జి ల ముక్కలకు రెండు కె.జీ ల ఆవపిండి, కారం , ఉప్పు మిశ్రమం కలపాలి .
ఈ మిశ్రమం కలి పేటప్పుడు మొత్తం గుండ రెండు కె. జీ. లను కుంటే 800 గ్రాములు ఆవ పిండి , 700 గ్రాములు కారం , 500 గ్రాములు మెత్తని ఎండబెట్టిన ఉప్పు వేసి కలపాలి .
అయోడైజ్డ్ ఉప్పును వాడవద్దు .
పచ్చడి రుచి పాడవుతుంది.
బజార్లో విడిగా ఉప్పు పాకెట్లు అమ్ముతారు .
అవి తెచ్చి తడి లేకుండా ఎండబెట్టుకోవాలి .
కొత్తావకాయ కలిపి జాడీలలో పెట్టుకున్న తర్వాత , ఆ బేసిన్ లో మిగిలిన ఆవపిండి లో వేడి వేడి అన్నం , మరియు నెయ్యి వేసి కలిపి అమ్మ పెట్టిన ముద్దలు తిన్న ఆ మధురానుభూతులు , ఆ అద్భుతమైన రుచి జీవితంలో మర్చిపోగలమా ?
నమస్తే ఆలూరి కృష్ణ ప్రసాద్ గారు.. ఆవకాయ కొలతలు కొంచెం స్పష్టంగా ఇవ్వండి.మీరు 12 కాయలకు ..(3కిలో ముక్కలు..అవుతాయి..వాటికి 2కిలో ఆవపిండి..కారం..ఉప్పు.??)
ReplyDeleteఇచ్చారా..ఎందుకో.. అర్ధంకాలేదు.