ఆలూరుకృష్ణప్రసాదు .
మరో వెరైటీ దోశెలు .
మూడు గ్లాసుల పుల్లని మజ్జిగ లో ఒక గ్లాసు అటుకులు , రెండు గ్లాసుల బియ్యము కలిపి ముందు రోజు రాత్రి నాన బెట్టు కోవాలి .
ఉదయాన్నే అయిదు పచ్చిమిర్చి , ఒక తరిగిన ఉల్లిపాయ తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
బయట ఒక గంట సేపు ఉంచాలి .
తర్వాత స్టౌ మీద పెనం పెట్టుకుని దోశెల లాగా వేసుకోవాలి .
ఈ దోశెలు చాలా మృదువుగా ఉంటాయి .
ఈ దోశెలలోకి వెరైటీగా పండు మిరపకాయల పెరుగు చట్నీ చేసాము .( ఫోటోలో చూడండి . )
ఎంతో రుచిగా ఉంది .
రెసిపీ విడిగా పెడుతున్నాను .
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
*************************
0 comments:
Post a Comment