Showing posts with label పప్పులో రకాలు. Show all posts
Showing posts with label పప్పులో రకాలు. Show all posts

Tuesday, July 24, 2018

మునగాకు కందిపప్పు పప్పుకూర

ఆలూరుకృష్ణప్రసాదు .

మునగాకు కందిపప్పు  పప్పు కూర .
******************
కావలసినవి .

మునగాకు లేత ఆకులు మరియు చిగురు ఒలిచినవి  --  మూడు కప్పులు .

మరీ ఆకులుగా ఉంటే చాకుతో కట్ చేసుకోవాలి .

కందిపప్పు  --  ఒక కప్పు.
కారం -- స్పూనున్నర
ఉప్పు  -  తగినంత
పసుపు -- కొద్దిగా

పోపునకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  -  4
ముక్కలుగా చేసుకోవాలి .
చాయమినపప్పు  - స్పూను
జీలకర్ర  - పావు స్పూను
ఆవాలు -  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
కరివేపాకు  --  రెండు రెమ్మలు .

తయారీ విధానము .

ముందుగా  కందిపప్పు  ఒకసారి కడిగి  తగినన్ని  నీళ్ళు పోసి స్టౌ  మీద పెట్టి  మూడు వంతులు  అనగా బద్దలుగా  ఉండికించుకోవాలి .

అంటే బద్ద చేతితో నొక్కితే  మెత్తగా  అవ్వాలి .

తర్వాత నీళ్ళు వడ కట్టుకుని విడిగా  పళ్ళెం లోకి తీసుకోవాలి .

స్టౌ మీద బాండి పెట్టి మొత్తము  నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయ  ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ  మరియు కరివేపాకు  వేసి పోపు వేయించుకోవాలి .

తర్వాత అందులోనే  సిద్ధం చేసుకున్న మునగాకు, కొద్దిగా  పసుపు వేసి మూత పెట్టి అయిదు నిముషాలు  ఆకును పూర్తిగా  మగ్గనివ్వాలి .

తర్వాత ఉడికించి సిద్ధంగా  ఉంచుకున్న  కందిపప్పు ను , తగినంత  ఉప్పు , స్పూనున్నర  కారం కూడా వేసి  అట్లకాడతో  బాగా కలిపి మూత పెట్టి మీడియం సెగన  మరో అయిదు నిముషాలు  మగ్గనివ్వాలి .

ఆ తర్వాత దింపుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే మునగాకు  పప్పుకూర  సర్వింగ్  కు సిద్ధం.

దీనికి  భోజనము లోకి కాంబినేషన్ గా నిమ్మకాయ కారం చాలా రుచిగా  ఉంటుంది .

ఈ కూర భోజనము లోకి , చపాతీలు మరియు రోటీల లోకి బాగుంటుంది .

సంబంధించిన  రెసిపి మరియు ఫోటో నా స్వంతం.

Monday, July 9, 2018

ముద్దపప్పు

ఆలూరుకృష్ణప్రసాదు .

శాకాహార ప్రియులకు  అత్యుత్తమ మైనది .

తర తరాల నుండి  వస్తున్న  ముద్ద పప్పు.

తయారీ విధానము .

ఒక  ఇత్తడి  గిన్నెలో  రెండు స్పూన్లు  నెయ్యి వేసి బాగా కాగగానే  ఒక కప్పు  కందిపప్పు  వేసి  బాగా వేయించుకుని  తగినన్ని  నీళ్ళు పోసి  మూతపెట్టి ఒక పదిహేను  నిముషముల పాటు  మెత్తగా  ఉడకనివ్వాలి .

నెయ్యి  వేసి వేయించాము  కనుక  ఇంక పప్పు  పొంగదు .

పప్పు  మెత్తగా  ఉడకగానే  సరిపడా ఉప్పు వేసి గరిటతో  బాగా యెనిపి  వేరే స్టీలు గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇత్తడి గిన్నెలోనే ఉంచితే  కొద్ది సేపటికి  కిలం వస్తుందని పెద్దలు  చెప్పే వారు.

ఇత్తడి  గిన్నె  లేని వారు ఇదే పద్థతి లో స్టీలు గిన్నెలో  చేసుకోవచ్చు.

Best  Combinations .

ముద్ద పప్పు  +  కొత్తావకాయ  +  నెయ్యి .

ముద్ద పప్పు +  ముక్కల పులుసు + పేరుకున్న నెయ్యి

ముద్ద పప్పు  + కొత్త నిమ్మకాయ +  నెయ్యి

ముద్ద పప్పు  +  మజ్జిగ  పులుసు

ముద్ద పప్పు  +  గుత్తి  వంకాయ కూర +  నెయ్యి

ముద్ద పప్పు  +  కొత్త పండు మిర్చి పచ్చడి +  నెయ్యి.

వేడి  వేడి  అన్నంలో పై విధంగా  తింటే  ఆ రుచే  అత్యద్భుతం.

కొస మెరుపు .

"  బ్రాహ్మణో  భోజన ప్రియః  ".

"  కోటి  రూపాయి లిచ్చినా  తృప్తి పడని  వ్యక్తి 
కడుపు నిండా  భోజనము  చేయగానే  సంతుష్టు డవుతాడు ."

"  అన్నదాతా  సుఖీభవ ."

Thursday, March 1, 2018

కొయ్య తోటకూర పప్పు

ఆలూరుకృష్ణప్రసాదు .

కొయ్య తోటకూర  పప్పు .

కావలసినవి .

కొయ్య తోటకూర  --

మా వైపు కట్టలు గా  అమ్మరు .
విడిగా  5  రూపాయలకు , 10  రూపాయలకు  అమ్ముతారు . 

ఆ తోటకూర  తెచ్చుకుని  ముదురు కాడలు  తీసి , లేత కాడలు  మరియు ఆకు  తరుగు కోవాలి .

ఈ తరిగిన  ఆకు  షుమారు  పావు కిలో  పప్పుకు  సరిపోతుంది .

కందిపప్పు  --  గ్లాసు లేదా షుమారు  150  గ్రాములు.

చింతపండు -- నిమ్మకాయంత . విడదీసి  పది నిముషాలు  సేపు  తడిపి  ఉంచుకోవాలి .
ఉల్లిపాయలు -- రెండు .
పచ్చిమిరపకాయలు  --   8
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు
ఉప్పు  --  తగినంత
పసుపు  --  పావు  స్పూను

పోపుకు .

ఎండుమిరపకాయలు  4  ముక్కలుగా  చేసుకోవాలి .

ఈ  కొయ్య  తోటకూర  పప్పుకు  నేతితో  పోపు  వేసుకుంటే   రుచిగా  ఉంటుంది .
నెయ్యి   --  3  స్పూన్లు

మెంతులు  --  పావు  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ  విధానము .

ఉల్లిపాయలు ముక్కలుగా తరుగు కోవాలి .

పచ్చిమిరపకాయలు నిలువుగా  తరుగుకోవాలి .

తర్వాత  ఒక వెడల్పాటి  గిన్నెలో  కందిపప్పు  వేసుకుని , ఒకసారి  పప్పును  కడిగి  సరిపడా  నీళ్ళు పోయాలి .

స్టౌ  మీద  పెట్టుకుని  పప్పును  పొంగకుండా  చూసుకుంటూ మూతపెట్టి  పప్పును మూడు  వంతులు పైన  మెత్తగా  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  తరిగిన   కొయ్య తోటకూర  , తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు , తడిపిన చింతపండు , పసుపు , కొద్దిగా  పచ్చి ఇంగువ , రెండు  రెమ్మలు   కరివేపాకు , తరిగిన   పచ్చిమిర్చి వేసి  నీళ్ళు  అవసరమైతే  కొద్దిగా  పోసుకుని  మూతపెట్టి   పప్పును  పూర్తిగా   ఉడకనివ్వాలి .

ఆ పైన తగినంత  ఉప్పు మరియు స్పూను  ఎండు కారము  వేసి మరో  అయిదు  నిముషాలు  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  పప్పుని గరిటతో  బాగా  కలుపుకోవాలి .

తర్వాత  స్టౌ  మీద  పోపు  గరిటె  పెట్టుకుని  మొత్తము  నెయ్యి   వేసుకుని  నెయ్యి  బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు  , కొద్దిగా  ఇంగువ  మరియు  కరివేపాకు  వేసుకుని  పోపు  పెట్టుకుని , పప్పులో  వేసుకుని  గరిటెతో బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  కొయ్య తోటకూర  పప్పు సర్వింగ్ కు  సిద్ధం .

ఈ  కొయ్య తోటకూర   పప్పు   భోజనము లోకి , చపాతీలు , రోటీలలోకి  కూడా   చాలా  రుచిగా  ఉంటుంది .

Sunday, December 10, 2017

ముద్దపప్పు

ఆలూరుకృష్ణప్రసాదు .

శాకాహార ప్రియులకు  అత్యుత్తమ మైనది .

తర తరాల నుండి  వస్తున్న  ముద్ద పప్పు.

తయారీ విధానము .

ఒక  ఇత్తడి  గిన్నెలో  రెండు స్పూన్లు  నెయ్యి వేసి బాగా కాగగానే  ఒక కప్పు  కందిపప్పు  వేసి  బాగా వేయించుకుని  తగినన్ని  నీళ్ళు పోసి  మూతపెట్టి ఒక పదిహేను  నిముషముల పాటు  మెత్తగా  ఉడకనివ్వాలి .

నెయ్యి  వేసి వేయించాము  కనుక  ఇంక పప్పు  పొంగదు .

పప్పు  మెత్తగా  ఉడకగానే  సరిపడా ఉప్పు వేసి గరిటతో  బాగా యెనిపి  వేరే స్టీలు గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇత్తడి గిన్నెలోనే ఉంచితే  కొద్ది సేపటికి  కిలం వస్తుందని పెద్దలు  చెప్పే వారు.

ఇత్తడి  గిన్నె  లేని వారు ఇదే పద్థతి లో స్టీలు గిన్నెలో  చేసుకోవచ్చు.

Best  Combinations .

ముద్ద పప్పు  +  కొత్తావకాయ  +  నెయ్యి .

ముద్ద పప్పు +  ముక్కల పులుసు + పేరుకున్న నెయ్యి

ముద్ద పప్పు  + కొత్త నిమ్మకాయ +  నెయ్యి

ముద్ద పప్పు  +  మజ్జిగ  పులుసు

ముద్ద పప్పు  +  గుత్తి  వంకాయ కూర +  నెయ్యి

ముద్ద పప్పు  +  కొత్త పండు మిర్చి పచ్చడి +  నెయ్యి.

వేడి  వేడి  అన్నంలో పై విధంగా  తింటే  ఆ రుచే  అత్యద్భుతం.

కొస మెరుపు .

"  బ్రాహ్మణో  భోజన ప్రియః  ".

"  కోటి  రూపాయి లిచ్చినా  తృప్తి పడని  వ్యక్తి 
కడుపు నిండా  భోజనము  చేయగానే  సంతుష్టు డవుతాడు ."

"  అన్నదాతా  సుఖీభవ ."

Thursday, November 30, 2017

వామన చింతకాయల పప్పు

ఆలూరుకృష్ణప్రసాదు .

మా అత్తగారు వామన చింతకాయలతో పప్పు చేసేవారు.

చాలా రుచిగా  ఉండేది .

మీ కోసం .

వామన చింతకాయలతో  పప్పు .

కావలసినవి .

  వామన చింతకాయలు  --  100  గ్రా
కందిపప్పు   --  150  గ్రా
పచ్చి మిరపకాయలు  --  6
కరివేపాకు  --  నాలుగు   రెమ్మలు
పసుపు  --  కొద్దిగా
ఉప్పు   ---  తగినంత
కారం  ---   ఒకటిన్నర   స్పూను

పోపుకు .

నూనె  ---  మూడు  స్పూను
ఎండుమిరపకాయలు  --- మూడు
ముక్కలుగా   చేసుకోవాలి .
మెంతులు  ---  పావు  స్పూను
జీలకర్ర   --  పావు  స్పూను
ఆవాలు  ---  అర  స్పూను
ఇంగువ  ---  కొద్దిగా

తయారీ  విధానము .

ముందుగా  ఒక  గిన్నెలో  కందిపప్పు   వేసుకుని   ఒకసారి  కడిగి  తగినన్ని   నీళ్ళు  పోసి  స్టౌ  మీద  పెట్టుకోవాలి  .

వామన చింతకాయలు శుభ్రంగా  కడిగి  చిన్న ముక్కలుగా  చేసుకుని  మిక్సీలో చింతకాయముక్కలు , పావు స్పూను  పసుపు మరియు స్పూను  ఉప్పు వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

పచ్చి గింజలు ఏమైనా  ఉంటే అందులో తీసి వేసుకోవాలి.

పచ్చిమిర్చి   నిలువుగా   తరుగు  కోవాలి .

పప్పు  దాదాపుగా ఉడకగానే ఈ చింతకాయల ముద్ద,
  పచ్చిమిర్చి , కరివేపాకు , కొద్దిగా  పసుపు  వేసి   పప్పును  పూర్తిగా   ఉడకనివ్వాలి  .

పప్పు  ఉడికాక  తగినంత  ఉప్పు  , ఒక  స్పూను  కారం  వేసి  మరో  మూడు  నిముషాలు   ఉంచి  దింపు కోవాలి .

తదుపరి  స్టౌ  మీద  పోపు  గరిటె  పెట్టి  నూనె  వేసి  నూనె  కాగగానే   ఎండుమిర్చి ,  మెంతులు , జీలకర్ర ,
ఆవాలు  , ఇంగువ  మరియు  కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకుని  పప్పులో  కలుపుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

వెల్లుల్లి   ఇష్టమైన  వారు  ఇంగువ  బదులు  ఒక  ఆరు  వెల్లుల్లి   రేకలు పోపులో  వేసుకోవచ్చు .

ఇదే  విధంగా  పెసరపప్పుతో  కూడా  చేసుకోవచ్చు .

అంతే  ఇంగువ   సువాసనతో  వామన చింత  కాయలతో  పప్పు   సర్వింగ్
కు  సిద్ధం .

Monday, July 17, 2017

వాక్కాయ పప్పు

వాక్కాయలతో పప్పు .
 ఆలూరు కృష్ణప్రసాదు

పావు కిలో  వాక్కాయలు   ముక్కలు  గా  తరుగుకోవాలి .
ఒక గ్లాసు  కందిపప్పు  తగినన్ని  నీళ్ళు  పోసి  స్టౌ మీద పెట్టి  పప్పును   మూడొంతులు  ఉడకనివ్వాలి  .
పప్పు  మూడొంతులు  ఉడకగానే  తరిగిన    వాక్కాయ ముక్కలు  , నాలుగు పచ్చిమిర్చి  ముక్కలుగా  చేసినవి , కాస్త పసుపు , కరివేపాకు , తగినంత  ఉప్పు మరియు  స్పూను  కారం   పప్పు లో వేయాలి .
పప్పు  మరియు  వాక్కాయ ముక్కలు    బాగా కలిసి పోయి  పూర్తిగా  ఉడకగానే  దింపాలి .
  మరల స్టౌ  మీద  పోపు  గరిట పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  మూడు ఎండుమిర్చి  ముక్కలుగా చేసి , జీలకర్ర  పావు స్పూను , ఆవాలు  అర స్పూను  మరియు  ఇంగువ  వేసి  పోపు  పెట్టుకోవాలి .
అంతే  పుల్ల  పుల్లగా  ఉండే  వాక్కాయలతో  పప్పు  సర్వింగ్ కు సిద్ధం.

Wednesday, June 14, 2017

బీరకాయ  పెసర పప్పు  పప్పు కూర.

బీరకాయ  పెసర పప్పు  పప్పు కూర.
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


కావలసినవి.
లేత  బీరకాయలు  --  5
చాయపెసరపప్పు  --  50  గ్రాములు .
పసుపు  ---  కొద్దిగా 
ఉప్పు  ---   తగినంత 
కారం   ---   స్పూను న్నర
పోపుకు  కావలసినవి .
నూనె  ---  మూడు  స్పూన్లు 
ఎండు మిరపకాయలు --  మూడు 
పొట్టు  మినపప్పు  --  స్పూను న్నర
జీలకర్ర  --   పావు  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
ఇంగువ  --   కొద్దిగా 
కరివేపాకు  ---  మూడు  రెబ్బలు.

తయారీ  విధానము  .
ముందుగా  బీరకాయలు  కడిగి 
పై  చెక్కు  తీసుకొని   మధ్యస్థంగా  ముక్కలుగా  తరుగు  కోవాలి .
చాయపెసరపప్పు  ఒకసారి  కడుగు కోవాలి .
కుక్కర్  లో ఒక అరగ్లాసు  నీళ్ళు పోసి   తరిగిన  బీరకాయ ముక్కలు మరియు  పెసరపప్పు  వేసి  స్టౌ  వెలిగించి   కుక్కర్   ఒక  విజిల్  రానిచ్చి  దింపేయాలి .
ఉప్పు  ముందు  వేయకూడదు .
వేసినట్లయితే  పెసర పప్పు  ఉడకదు .
ఉడికిన  తర్వాత  నీళ్ళు  ఎక్కువ   ఉంటే  వడకట్టండి .
కొద్దిగా   ఉంటే  ఉంచేయండి .   
ఆ తర్వాత  స్టౌ  మీద  బాండీ  పెట్టి
నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండు మిరప కాయ ముక్కలు , పొట్టు  మినపప్పు  , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ  మరియు కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకుని  ఉడికిని  బీరకాయ పెసరపప్పు  అందులో  వేసి  పసుపు , తగినంత  ఉప్పువేసి  ఒక అయిదు  నిముషాలు   మగ్గనివ్వాలి .
ఆ తర్వాత  కారం  వేసి  మరో  మూడు  నిముషములు  ఉంచి  దించుకోవాలి .
అంతే  ఘమ  ఘమ లాడే  ఇంగువ  వాసనతో  బీరకాయ  పెసర పప్పు  పప్పుకూర  సర్వింగ్ కు  సిద్ధం.
ఈ  కూర  పొడి  పొడిగా  ఉంటే  బాగుంటుంది .
అన్నం లోకి  మరియు  చపాతీల లోకి  కూడా ఈ  కూర  బాగుంటుంది .

Saturday, June 10, 2017

రాచ ఉసిరి కాయలతో పప్పు

రాచ ఉసిరి కాయలతో పప్పు
ఆలూరుకృష్ణప్రసాదు .

రాచ  ఉసిరి  కాయలతో  పప్పు .
కావలసినవి .
రాచ  ఉసిరి  కాయలు  --  200  గ్రా
కందిపప్పు   --  150  గ్రా
పచ్చి మిరపకాయలు  --  6
కరివేపాకు  --  నాలుగు   రెమ్మలు
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు   ---  తగినంత 
కారం  ---   ఒకటిన్నర   స్పూను

పోపుకు .
నూనె  ---  మూడు  స్పూను 
ఎండుమిరపకాయలు  --- మూడు
ముక్కలుగా   చేసుకోవాలి .
మెంతులు  ---  పావు  స్పూను 
జీలకర్ర   --  పావు  స్పూను 
ఆవాలు  ---  అర  స్పూను
ఇంగువ  ---  కొద్దిగా

తయారీ  విధానము .
ముందుగా  ఒక  గిన్నెలో  కందిపప్పు   వేసుకుని   ఒకసారి  కడిగి  తగినన్ని   నీళ్ళు  పోసి  స్టౌ  మీద  పెట్టుకోవాలి  .
రాచ  ఉసిరి  కాయలు  కట్  చేసుకుని   లోపల  గింజ  తీసి  ముక్కలుగా   తరుగు కోవాలి .
పచ్చిమిర్చి   నిలువుగా   తరుగు  కోవాలి .
పప్పు  మూడొంతులు  ఉడకగానే రాచ ఉసిరి  ముక్కలు ,  పచ్చిమిర్చి , కరివేపాకు , కొద్దిగా  పసుపు  వేసి   పప్పును  పూర్తిగా   ఉడకనివ్వాలి  .

పప్పు  ఉడికాక  తగినంత  ఉప్పు  , ఒక  స్పూను  కారం  వేసి  మరో  మూడు  నిముషాలు   ఉంచి  దింపు కోవాలి .
తదుపరి  స్టౌ  మీద  పోపు  గరిటె  పెట్టి  నూనె  వేసి  నూనె  కాగగానే   ఎండుమిర్చి ,  మెంతులు , జీలకర్ర ,
ఆవాలు  , ఇంగువ  మరియు  కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకుని  పప్పులో  కలుపుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .


వెల్లుల్లి   ఇష్టమైన  వారు  ఇంగువ  బదులు  ఒక  ఆరు  వెల్లుల్లి   రేకలు పోపులో  వేసుకోవచ్చు .
ఇదే  విధంగా  పెసరపప్పుతో  కూడా  చేసుకోవచ్చు .
అంతే  ఇంగువ   సువాసనతో  రాచ ఉసిరి  కాయలతో  పప్పు   సర్వింగ్
కు  సిద్ధం .

Wednesday, May 31, 2017

పాలకూర పెసర పప్పు .

పాలకూర పెసర పప్పు .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసిన పదార్ధములు ----
చాయ పెసర పప్పు -- 100 గ్రాములు.
పాలకూర --- పెద్ద కట్ట ఒకటి
పచ్చి మిరపకాయలు --- 6
పసుపు --- కొద్దిగా
కరివేపాకు --- తగినంత
ఇంగువ --- తగినంత .
పోపుకు కావలసినవి ----
ఎండు మిరపకాయలు -- రెండు
ఆవాలు -- తగినన్ని
జీలకర్ర ---- కొద్దిగా
తయారు చేయు విధానము .
ముందు పాలకూర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోండి.
స్టౌ వెలిగించి చాయ పెసర పప్పు 
శుభ్రంగా నీళ్ళు పోసి కడుక్కుని తగినంత నీరు పోసి మధ్యస్ధమైన
మంట మీద పప్పు పొంగ కుండా చూసుకుంటూ మూడు వంతులు ఉడికాక అందులో తరిగిన పాలకూర , తరిగిన పచ్చి మిరపకాయలు , కరివేపాకు , కొద్దిగా పసుపు, ముఖ్యంగా పచ్చి
ఇంగువ వేసి మెత్తగా ఉడికాక
గరిటతో కలిపి పైన చెప్పిన వాటితో తగినంత నూనె వేసి పోపు పెట్టుకొనండి .

పోపులో ఇష్టమైన వారు చాయ మినపప్పు వేసుకోండి.
పైన కొత్తిమీర ఇష్టమైన వారు వేసుకోండి.
మెంతులు పోపులో వేయనవసరము లేదు.
అంతే కమ్మని ఇంగువ వాసనతో
సాంప్రదాయిక మైన పాలకూర పెసర పప్పు అన్నంలోకి మరియు
రోటీల లోకి సిద్ధం.

దోసకాయ పప్పు .

 దోసకాయ పప్పు .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఆ మాత్రం దోసకాయ పప్పు చేసుకోవడం కూడా రాని వారుంటారా ?
ఇదొక రెసిపీ నా ? అని అనుకోవద్దు .
ఇప్పుడంతా కొత్త పోకడల వంటలు కదా .
దోసకాయ పప్పు అని చెప్పగానే వెంటనే
1. ఇందులో చింతపండు బదులు మామిడి కాయ ముక్కలు వేసుకుంటే taste అదిరి పోతుంది
2. మేము దోసకాయతో పాటు ఉల్లిపాయల బదులుగా టమోటో లు వేసుకుంటాము .
3. మేం దోసకాయ పప్పు లో చింతపండు వేయం . కొండ గోంగూర వెసుకుంటాం.
4 ఈ సారి ఇంగువ బదులు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పోపులో తగిలించండి . Taste అదిరిపోతుంది .
5 . మేము గరమ్ మసాలా పొడి ఒక స్పూను వేసుకుంటాము .
ఈసారి మీరు కూడా తగిలించండి.
ఇలా రక రకాల కామెంట్లు కనిపిస్తాయి .
అలా మార్చి చేయడం తప్పని కాదు .
ఎవరి అభిరుచి ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు .
అయితే అసలు దోసకాయ పప్పు రెసిపీ మిస్ కాకూడదు కదా .
అంటే traditional రెసిపీ .
ఇంక అసలు కధ లోకి వద్దాము .
దోసకాయ పప్పు .
కావలసినవి .
కందిపప్పు ---- ఒక పెద్ద గ్లాసు .
పసుపు పచ్చని గట్టిగా ఉండే 
 దోసకాయ --- పెద్దది ఒకటి .

ఉల్లిపాయలు -- మూడు .
పచ్చి మిర్చి --- ఆరు .
చింతపండు --- నిమ్మకాయంత
కారం -- ఒక స్పూను
పసుపు --- పావు టీ స్పూను
ఉప్పు --- తగినంత
కరివేపాకు --- రెండు రెమ్మలు
పోపుకు .
నూనె --- మూడు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- మూడు 
తుంపుకుని ముక్కలు చేసుకోవాలి .

మెంతులు -- పావు స్పూను
జీలకర్ర --- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా .
కరివేపాకు --- రెండు రెమ్మలు .
తయారీ విధానము .
ముందుగా దోసకాయ పై చెక్కు తీసుకుని ముక్క , గింజలు చేదు ఉన్నాయో లేదో చూసుకుని , గింజలతో సహా ముక్కలు గా తరుగుకోవాలి .
ఉల్లిపాయలు ముక్కలుగా తరుగు కోవాలి .
చింతపండు విడదీసి కొద్ది నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .
పచ్చి మిర్చి నిలువుగా తరుగు కోవాలి .
మేము మా ఇంట్లో ఏ వంటకైనా కుక్కర్ వాడము .
గిన్నెలలోనే చేసుకుంటాము .
ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు వేసి ఒకసారి కడిగి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి పప్పు మూడు వంతులు ఉడకనివ్వాలి .
ఉప్పు ముందు వేయ వద్దు .
పప్పు ఉడకదు .
తర్వాత దోసకాయ ముక్కలు , ఉల్లిపాయ ముక్కలు , తడిపిన చింతపండు , పచ్చిమిర్చి , కరివేపాకు , పసుపు వేసి మూత పెట్టి మరో పది నిముషాలు పూర్తిగా ఉడకనివ్వాలి .
తర్వాత ఒక స్పూను కారం , తగినంత ఉప్పువేసి రెండు నిముషాలు ఉడక నిచ్చి దింపు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ముందు మెంతులు వేసి వేగనివ్వాలి .
తరువాత వరుసగా ఎండుమిర్చి ముక్కలు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేగగానే పప్పులో పోపు పెట్టుకుని గరిటతో బాగా కలుపుకోండి .

అంతే . ఇంగువ ఘమ ఘమ తో ఎంతో రుచిగా ఉండే ప్రాచీన వంటకం దోసకాయ పప్పు సర్వింగ్ కు సిద్ధం.
ఈ పప్పు అన్నం లోకి రోటీలలోకి కూడా బాగుంటుంది .
దోసకాయ పప్పు లో పాత తరం వాళ్ళు పప్పులో ఉల్లిపాయ వేస్తే దేవునికి నైవేద్యానికి పనికి రాదని , చాలా మంది ఇళ్ళల్లో పెద్ద ఉల్లిపాయ కూడా తినక పోవడం వల్ల ఉల్లిపాయ వేయకుండానే చేసేవారు.
మేం ఉల్లిపాయ వేసి ఒక సారి వేయకుండా మరోసారి రెండు రకములుగా కూడా చేసుకుంటాము .
నిజానికి 100% ప్రాచీన దోసకాయ పప్పు వంటకం ఉల్లిపాయ వేయనిదే.

" మిక్సెడ్ ఆకు కూరల పప్పు "

 మిక్సెడ్ ఆకు కూరల పప్పు 
 ఆలూరి కృష్ణ ప్రసాద్


కావలసినవి
కందిపప్పు --- 150 గ్రాములు
పాలకూర ---- ఒక కట్ట
తోటకూర ---- ఒక కట్ట
గోంగూర ----- పులుపుని బట్టి పావు కట్ట లేదా అర కట్ట
పచ్చిమిర్చి --- ఐదు లేక ఆరు 
టమోటాలు --- పావు కిలో

తాలింపు దినుసులు
నూనె --- రెండు స్పూన్లు 
ఎండు మిర్చి --- మూడు
మినపప్పు --- ఒక స్పూను 
పచ్చిశనగపప్పు --- ఒక స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా

పసుపు --- కొద్దిగా
ఉప్పు ---- తగినంత 
కరివేపాకు --- మూడు రెబ్బలు

తయారు చేయు విధానము
ఆకు కూరలన్నీ శుభ్రం చేసుకుని సన్నగా తరగాలి .
ఒక గిన్నెలో కడిగిన కందిపప్పు ,
సన్నగా తరిగిన అన్ని ఆకు కూరల
తరుగు , పచ్చి మిర్చి ముక్కలు , కరివేపాకు రెబ్బలు, పసుపు వేసి టమోటా ముక్కలు వేసుకుని 
పప్పు లో తగినంత నీరు పోసి
కుక్కర్ లో మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి ఉడికిన ఆకు కూరల పప్పుని మెత్తగా మెదపాలి.
ఆ తర్వాత పైన చెప్పిన దినుసులన్నీ వేసి పోపు పెట్టుకోవాలి .
ఇతర ఆకు కూరలకు గోంగూర లేదా చుక్కకూర కలిపితే , ఆ ఆకు కూరల్లో ఉండే పులుపు
పప్పు కి సరిపోతుంది కనుక చింతపండు రసం వేయనక్కర లేదు .

కాలానుగుణంగా గోంగూర, చుక్క కూర బదులుగా పుల్లటి మామిడి కాయ ముక్కలు లేదా కొత్త చింతకాయలు ఈ ఆకు కూరల పప్పు లో వేసుకోవచ్చు .
ఈ మిక్సెడ్ ఆకు కూరల పప్పు అన్నం లోకి మరియు చపాతీలలోకి కూడా బాగుంటుంది .
పాలకూర టమోటో లు కలిపి వండితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని Comments లో కొందరు సందేహం వెలిబుచ్చారు .
అందువలన పాలకూర వేయకుండా లేదా టమోటో లు వేయకుండా చేసుకోండి .
సందేహపడుతూ చేయకూడదు కదా .

Tuesday, May 30, 2017

నిమ్మకాయ పప్పు .

నిమ్మకాయ పప్పు .
ఆలూరి కృష్ణ ప్రసాద్

బ్రహ్మచారి వంటలు . - అంటే ఎక్కువ Process లేకుండా సులువుగా అయ్యే వంటలు .
ఉద్యోగాలు చేసుకుంటూ అరగంట లో వంట పూర్తి చేసుకొని duty కు పరుగులు పెట్టాల్సిన యువతీ యువకులు 90 శాతం మంది పైగా కుక్కర్ ను ఉపయోగిస్తున్నారు .
చాదస్తంగా ఇత్తడి గిన్నెలో చేసుకోవాలి , ఈ వస్తువు లేదు అనుకుంటే కుదరదు .
ఉన్న దాంట్లో గబగబా చేసుకుని ఉద్యోగాలకు పరిగెత్తాలి .
తయారీ విధానము .
ఒక కప్పు కందిపప్పు ఒకసారి కడిగి తగినన్ని నీళ్ళు పోసి అందు లో నాలుగు పచ్చిమిర్చి ముక్కలు గా తరిగి వేయండి .
కాస్త కరివేపాకు కూడా వేసుకోండి.
కొద్దిగా పసుపు వేయండి .
ఉప్పు వేయవద్దు .
కుక్కర్ మూడు విజిల్స్ రాగానే స్టౌ ఆపేయండి.
రెండు నిమ్మకాయలు కోసి రసం తీసి ఉడికిన పప్పులో వేయండి.
తగినంత ఉప్పు వేయండి .
స్టౌ మీద పోపు గరిటె పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి రెండు ఎండుమిర్చి , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి పోపు వేసుకోండి .
గరిటతో బాగా కలుపుకోండి .
సులువుగా తయారయ్యే నిమ్మకాయ పప్పు సిద్ధం.
ఇదే పద్ధతిలో కందిపప్పు బదులుగా చాయపెసరపప్పు తో కూడా చేసుకోవచ్చు .
అలా కూడా చాలా బాగుంటుంది .

చుక్క కూర పప్పు

చుక్క కూర పప్పు
ఆలూరి కృష్ణ ప్రసాద్

ప్రియ మిత్రులారా !
ఆరోగ్యానికి చుక్క కూర చాలా మంచిది .
చుక్క కూర అందరూ పప్పు చేస్తారు.
పెసరపప్పు లో కంటే కందిపప్పు లో వేసుకుంటేనే చుక్క కూర పప్పు చాలా రుచిగా ఉంటుంది .
తయారు చేసే విధానం కూడా చాలా సులభం.
ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు లో తగినంత నీరు పోసి స్టౌ మీద పెట్టి మూత పెట్టకుండా ఉడకనివ్వాలి .
మూత పెడితే పప్పు పైకి పొంగుతుంది.
పప్పును మూడొంతుల పైగా ఉడకనివ్వాలి .
ఆ తర్వాత అందులో తరిగిన చుక్కకూర , తరిగిన పచ్చి మిరపకాయ ముక్కలు , కరివేపాకు , కొంచెం పసుపు వేసి
సన్నని సెగన మరో పది నిముషముల పాటు ఉడకనివ్వాలి .

ఇప్పుడు తగినంత ఉప్పు వేయాలి .
మరో మూడు నిముషములపాటు ఉంచి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోండి .
తదుపరి కాసిని మెంతులు , ఎండు మిరపకాయలు , ఆవాలు , ఇంగువ వేసి నూనె పోపు పెట్టుకోండి.
అంతే ఊరించే చుక్క కూర పప్పు సిద్ధం.
చుక్క కూరలో సహజంగానే పులుపు ఉంటుంది కాబట్టి ఇంక చింతపండు వేసుకోనక్కరలేదు.
అంతే నోరూరించే పులపుల్లని చుక్కకూర పప్పు అన్నం లోకి మరియు చపాతీల లోకి సిద్ధం .
ఫోటో You tube.

లేత మునగాకు తో పప్పు .

లేత మునగాకు తో పప్పు .
ఆలూరి కృష్ణ ప్రసాద్

ఆషాఢ మాసం తప్పనిసరిగా మునగాకు ఒక్కసారైనా తినాలని పెద్దలు అంటారు .
కారణం మునగాకు లో కడుపు లోని క్రిముల్ని నశింప చేసే శక్తి ఉందని చెప్తారు .
కాని లేత మునగాకు దొరికినప్పుడు దానితో పప్ఫు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది .

కావలసినవి.
లేత మునగాకు -- షుమారు 200 గ్రా .
కందిపప్పు -- ఒక గ్లాసు
చింతపండు - పెద్ద ఉసిరికాయంత
పచ్చిమిర్చి - 5
కరివేపాకు -- రెండు రెమ్మలు.
పసుపు - కొద్దిగా 
ఉప్పు -- తగినంత .
కారం --- స్పూను

పోపుకు .
ఎండుమిర్చి -- 3
మినపప్పు -- స్పూను
మెంతులు -- పావు స్పూను 
జీలకర్ర -- పావు స్పూను 
ఆవాలు -- పావు స్పూను
ఇంగువ -- తగినంత

ముందుగా చింతపండు విడదీసి తడిపి ఉంచుకోవాలి .
మునగాకు వలిచి శుభ్రంచేసుకుని ఒకసారి కడిగి తరుక్కోవాలి .
లేత చిన్న కాడలు వేసుకోవచ్చు .
పచ్చిమిర్చి నిలువుగా తరుక్కోవాలి .
ఇప్పుడు కందిపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద ఉడకనివ్వాలి .
పప్పు మూడు వంతులు ఉడకగానే మునగాకు , పచ్చిమిర్చి , చింతపండు , కరివేపాకు , పసుపు , స్పూను కారం వేసి పూర్తిగా ఉడకనివ్వాలి
ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి గరిటతో బాగా కలుపుకొని దింపు కోవాలి .
తర్వాత పోపు గరిట లో నూనె వేసి ఎండుమిర్చి , మినపప్పు , మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసుకుని పోపు పెట్టుకోవాలి .
అంతే లేత మునగాకు తో పప్పు సర్వింగ్ కు సిద్ధం.

Monday, May 29, 2017

కొయ్య తోటకూర తో పప్పు

కొయ్య తోటకూర తో పప్పు
ఆలూరి కృష్ణ ప్రసాద్

ప్రియమిత్రులందరికీ... ఈ రోజు మన మిత్రులందరికీ కొయ్య తోటకూర తో పప్పు తయారు చేసుకునే విధానము గురించి తెలియ చేస్తున్నాను.
మనకు తోటకూర లో రెండు రకములు వస్తాయి.
మొదటిది పెరుగు తోటకూర.
అంటే చిన్న చిన్న మొక్కలు గా వస్తాయి.
రెండవది కొయ్యతోటకూర లేదా చిలక తోటకూర అని కూడా పిలుస్తారు.
ఈ చిలుక తోటకూర గుబురుగా చిన్న ఆకులతో చిన్న చిన్న కొమ్మలుగా పెరుగుతుంది .
కొయ్య తోటకూర ఎలా ఉంటుందో ఫోటో పెట్టాను.
ఫోటోలో చూడండి.
ఈ కొయ్య తోటకూర తో ముఖ్యంగా పప్పు బాగుంటుంది.
అది కూడా కందిపప్పు తోనే బాగుంటుంది.
కొంతమంది కొయ్యతోటకూరతో పులుసు కూర కూడా చేసుకుంటారు .
కానీ గోంగూర , తోటకూర , పాలకూరతో పులుసు కూర చేసుకున్నంత రుచిగా ఈ కొయ్య తోటకూర పులుసు కూర అన్పించదు .
ఇంక కొయ్య తోటకూర తో పప్పు తయారు చేసుకునే విధానము .
కావలసినవి.
కొయ్య తోటకూర -- షుమారుగా ఒక పది రూపాయలకు అర కిలో కూర వస్తుంది.
కందిపప్పు --- 200 గ్రాములు
ఉల్లిపాయలు -- పెద్దవి మూడు
పచ్చిమిర్చి --- ఆరు
చింతపండు -- షుమారుగా చిన్న నిమ్మకాయంత
కారం -- 2 టీ స్పూన్లు
ఉప్పు -- తగినంత
పసుపు -- కొద్దిగా
పోపుకు కావలసినవి.
నూనె --- మూడు స్పూన్లు .
మెంతులు -- ఒక స్పూను
ఆవాలు -- ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
మినపప్పు - ఒక స్పూను
ఇంగువ -- తగినంత
తయారీ విధానము.
ముందుగా కొయ్య తోటకూర శుభ్రంగా కడుక్కొని ముదురు కాడలు తీసేసు కొవాలి.
ఆకుతో ఉన్న చిన్న లేత కాడలు ఉంచుకోవాలి.
ఆకును సన్నగా తరుగు కోవాలి.
ఉల్లిపాయలు తొక్క తీసి మామూలు సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
చింతపండు లో ఈనెలు, గింజలు తీసి చాలా కొద్దిగా నీళ్ళ తో తడిపి ఉంచుకోవాలి.
చింతపండు రసం తీయక్కర లేదు.
ఆ పళంగానే పప్పులో వేసుకోవచ్చు .
కందిపప్పు ఒక గిన్నెలో పోసి ఒకసారి కడిగి తగినన్ని నీళ్ళు పోసి , స్టౌ వెలిగించి స్టౌ మీద పెట్టుకోవాలి.
ఎప్పుడు పప్పు లో ముందు ఉప్పు వేయకూడదు .
ఆ విధంగా ముందు ఉప్పు వేస్తే పప్పు అసలు ఉడకదు .
పప్పు మూడువంతులు ఉడికాక ( అంటే చేత్తో కందబద్ద పట్టుకొని చూస్తే మెత్తగా అవ్వాలి ) తగినన్ని నీళ్ళు ఉన్నాయేమో చూసుకుని వరుసగా తరిగి ఉంచుకున్న కొయ్య తోటకూర, పసుపు , పచ్చిమిర్చి ముక్కలు , ఉల్లిపాయ ముక్కలు , నానబెట్టిన చింతపండు వేసి మూతబెట్టి కొయ్య తోటకూర , పప్పు బాగా మెత్తగా ఉడికే దాక ఉంచండి.
మనం పోసిన నీళ్ళు సరిపోక పోతే కొద్దిగా పోయండి.
పప్పు , కూర , మరియు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా కలిసి పోయేలా ఉడికాక , ఇప్పుడు సరిపడ ఉప్పు , రెండు స్పూన్ల కారం వేసి గరిటతో బాగా కలియ బెట్టండి .
దించాక స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి వరుసగా మెంతులు , ఎండుమిర్చి , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి తాలింపు వేసి పప్పులో కలుపుకోండి .
అంతే కమ్మని ఇంగువ వాసనతో ఘుమ ఘమ లాడే కొయ్య తోటకూర పప్పు అన్నం లోకి , మరియు చపాతీలలోకి సిద్ధం.
మేము సాధారణంగా ఆకు కూర పప్పుల పోపులో కరివేపాకు వేయము .
మీ కిష్టమైతే వేసుకోండి.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి