ఆలూరుకృష్ణప్రసాదు .
గుంటూరు స్పెషల్ .
పచ్చిమిరపకాయల కారం.
కావలసినవి .
పచ్చిమిరపకాయలు -- 100 గ్రాములు .
చింతపండు -- నిమ్మకాయంత విడదీసి తడిపి ఉంచుకోవాలి.
ఉప్పు -- తగినంత .
పసుపు -- కొద్దిగా .
నూనె -- నాలుగు స్పూన్లు
పోపునకు.
మెంతులు -- అర స్పూను
చాయమినపప్పు -- స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసుకుని నూనె బాగా కాగగానే పచ్చిమిరపకాయలు , పసుపు వేసి మూతపెట్టి పచ్చిమిర్చి బాగా మగ్గనివ్వాలి .
తర్వాత వాటిని వేరే ప్లేటులో తీసుకోవాలి .
తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన రెండు స్పూన్లు మెంతులు , మినపప్పు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి .
తర్వాత మిక్సీలో మగ్గిన పచ్చిమిరపకాయలు , తడిపిన చింతపండు , తగినంత ఉప్పువేసి పచ్చడి బండతో మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేగిన పోపు మిక్సీ లో వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి
కారంగా తినలేని వారు చిన్న బెల్లం ముక్క వేసి మిక్సీ వేసుకోండి .
ఈ పచ్చడి లో ఎండుమిరపకాయలు , కొత్తిమీర , కరివేపాకు వంటివి వేయరు .
చింతపండు సమంగా పడితే పచ్చడి నోరుమండి పోయే కారం ఉండదు .
అంతే ఎంతో రుచిగా ఉండే ఈ గుంటూరు స్పెషల్ పచ్చిమిరపకాయల కారం ఇడ్లీ , దోశెలు , గారెలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి చెప్పనలవి కాదు.
0 comments:
Post a Comment