ఆలూరుకృష్ణప్రసాదు .
ఉల్లిపాయ చట్నీ.
ఉల్లిపాయలు రెండు ముక్కలుగా తరుగుకొని , పచ్చిమిర్చి ఆరు ,చింతపండు రెబ్బలు మూడు , తగినంత ఉప్పు , ఇష్టమైన వారు కొద్దిగా బెల్లం వేసుకుని ఏదీ వేయించనవసరం లేదు.
మిక్సీ లో పైన చెప్పినవన్నీ వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పైన మూడు స్పూన్లు నెయ్యి పోపు గరిటెలో వేసి స్పూనున్నర మినపప్పు , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ , రెండుఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసి పోపు పెట్టుకోవాలి .
ఈ పచ్చడి ఇడ్లీ దోశెలు మరియు భోజనము లోకి కూడా బాగుంటుంది.
ఉల్లిపాయల పచ్చి వాసన ఇష్టము లేని వారు ఇదే పద్థతిలో ఉల్లిపాయల ముక్కలను మగ్గ పెట్టుకుని చేసుకోవచ్చును.
0 comments:
Post a Comment