ఆలూరుకృష్ణప్రసాదు .
కాకరకాయ కొబ్బరి కారం వేపుడు కూర.
కావలసినవి .
ముందు కొబ్బరి కారానికి .
ఎండుమిరపకాయలు -- 10
పచ్చి శనగపప్పు -- మూడు స్పూన్లు .
జీలకర్ర -- స్పూను .
ఎండుకొబ్బరి -- పావు చిప్ప . చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
కరివేపాకు -- నాలుగు రెమ్మలు.
ఇవ్వన్నీ నూనె వేయకుండా బాండిలో కమ్మని వేపు వచ్చేదాకా వేయించుకోవాలి .
చల్లారగానే మిక్సీలో వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి.
కాకరకాయలు అరకిలో ఫోటోలో చూపిన విధముగా చక్రాలు మాదిరిగా తరుగు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి అయిదు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే చక్రాలుగా తరిగిన కాకరకాయ ముక్కలను వేసి బాగా ఎర్రగా వేగ నివ్వాలి .
తరువాత సిద్ధంగా ఉంచుకున్న కొబ్బరి కారం పొడి కూడా అందులో వేసి బాగా కలుపుకుని మరో అయిదు నిముషాలు ఉంచి దింపుకోవాలి .
వెల్లుల్లి ఇష్టమైన వారు ఆరు వెల్లుల్లి రెబ్బలు పొడిలో వేసుకుని మిక్సీ వేసుకుంటే ఈ కాకరకాయ వేపుడు కూర చాలా రుచిగా ఉంటుంది .
అంతే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కొబ్బరి కారం వేపుడు కూర సర్వింగ్ కు సిద్ధం.
ఈ వేపుడు కూర వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment