ఆలూరుకృష్ణప్రసాదు .
చుక్కకూర పచ్చడి .
కావలసినవి .
చుక్కకూర -- రెండు కట్టలు.
పచ్చిమిర్చి -- 8
నూనె -- అయిదు స్పూన్లు
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
పోపునకు.
ఎండుమిరపకాయలు -- 6
చాయమినపప్పు -- స్పూనున్నర
మెంతులు -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను .
ఇంగువ -- కొద్దిగా .
తయారీ విధానము .
ముందుగా చుక్కకూరలో ముదురు కాడలు తీసి వేసి శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే చుక్కకూర , పచ్చిమిర్చి , పసుపు వేసి మూత పెట్టి ఆకును మగ్గ నివ్వాలి .
తర్వాత మగ్గిన ఆకును విడిగా ప్లేటులో తీసుకోవాలి .
తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు, మినపప్పు , మెంతులు , ఆవాలు , ఇంగువ వేసి పోపు వేసుకోవాలి .
ఈ వేయించిన పోపును మిక్సీ లో వేసి , తగినంత ఉప్పును వేసి మెత్తగా మిక్సీ వేసు కోవాలి .
తర్వాత మగ్గిన చుక్క కూర , పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి.
తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి.
ఇష్టమైన వారు మినపప్పు , ఆవాలు మరియు ఎండుమిర్చి వేసి తిరిగి పైన పోపు వేసుకోవచ్చు .
ఈ చుక్కకూర పచ్చడిలో ఆకులో పులుపు ఉంటుంది కనుక చింతపండు వేయనవసరము లేదు.
ఈ పచ్చడి దోశెలు, చపాతీలు మరియు భోజనము లోకి ఎంతో రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment