బెండకాయ కాయల పళంగా కూర .
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా పది ఎండుమిరపకాయలు , మూడు స్పూన్లు పచ్చి శనగపప్పు , రెండు స్పూన్లు మినపప్పు , నాలుగు స్పూన్లు ధనియాలు , అర స్పూను జీలకర్ర , కొద్దిగా ఇంగువ మరియు తగినంత ఉప్పు వేసుకుని ఎర్రగా వేయించు కోవాలి .
తర్వాత మిక్సీలో మరీ మెత్తగా కాకుండా పొడి వేసుకోవాలి.
ఒక పావు కిలో బెండకాయలు రెండు వైపులా చాకుతో కట్ చేసుకుని మధ్యలో గాటు పెట్టు కోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి ఈ ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి .
తర్వాత ముక్కలను విడిగా పళ్ళెంలో తీసుకుని కాయలలో ఈ పొడి పెట్టుకుని బాగా కాగిన వేడి వేడి నూనె కాయలలో పోసుకోవాలి .
అంతే బెండకాయ కాయల పళంగా పొడి కూర భోజనము లోకి సిద్ధం.
ఈ కూర వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment