ఆలూరుకృష్ణప్రసాదు .
సంక్రాంతి స్పెషల్ వంటలు .
మైసూర్ పాక్ .
కావలసినవి .
శనగపిండి - కప్పు
పంచదార -- కప్పున్నర.
నెయ్యి -- రెండు కప్పులు .
నెయ్యి విడిగా ముందుగా బాగా కాచుకుని ఉంచుకోవాలి .
వంట సోడా ఉప్పు -- చిటికెడు .
నీళ్ళు -- ఒక కప్పు .
శనగపిండి కల్తీ లేనిది తీసుకుని శుభ్రంగా జల్లించుకోవాలి .
అందులో చిటికెడు సోడా ఉప్పువేసి బాగా కలుపుకోవాలి .
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద దళసరి గిన్నె పెట్టుకుని , ఒకటిన్నర కప్పు పంచదార మరియు కప్పు నీళ్ళు పోసి గరిటతో బాగా కలపాలి .
నీళ్ళు బాగా తెర్లుతుండగానే శనగ పిండిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండకట్టకుండా గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి .
పిండి బాగా కలవగానే ముందుగా సిద్ధం చేసుకున్న నెయ్యి గరిటెతో కొద్ది కొద్దిగా పొసుకుంటూ స్టౌ మీడియం సెగలో ఉంచి గరిటెతో బాగా కలుపుతుండాలి .
ఒక వెడల్పాటి పళ్ళానికి నెయ్యి రాసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి .
పాకం , పిండి , నెయ్యి అన్నీ బాగా కలిసి పొంగు మాదిరిగా వచ్చి బాగా దగ్గర పడుతున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని పాకాన్ని పళ్ళెంలో పోసి వేడి మీదనే ముక్కలు కోసుకోవాలి .
మెత్తగా ఇష్ట పడేవారు కొంచెం ముందుగా , గట్టిగా ఇష్టపడేవారు కొద్దిగా ముదురు పాకం రానిచ్చి దింపుకోవాలి .
కొంతమంది కప్పు నెయ్యి మరియు కప్పు నూనె కలిపి చేసుకుంటారు .
మేమయితే పూర్తిగా నెయ్యి తోనే చేస్తాము .
అంతే ఎంతో రుచిగా కమ్మని నేతి వాసనతో ఉండే సంక్రాంతి స్పెషల్ మైసూర్ పాక్ మీ అందరి కోసం సిద్ధం.
0 comments:
Post a Comment