ఆలూరుకృష్ణప్రసాదు .
సంక్రాంతి స్పెషల్ .
మినప సున్నుండలు ఏ విధంగా చేసుకుంటామో చాయపెసరపప్పు ను మిగిలిన పప్పులతో కలిపి కూడా లడ్డూలు చేసుకోవచ్చును .
పెసర పప్పు పల్లీ పప్పుతో లడ్డూలు .
కావలసినవి .
చాయపెసర పప్పు -- ఒక కప్పు
నెయ్యి -- ఒక కప్పు.
కాచి ఉంచుకోవాలి .
పంచదార -- రెండు కప్పులు .
వేరు శనగపప్పు -- ఒక కప్పు.
జీడిపప్పు మరియు
బాదం పప్పు -- అర కప్పు .
కాచి చల్లారిన పాలు -- పావు కప్పు.
యాలకుల పొడి -- ఒకటిన్నర స్పూను .
తయారీ విధానము .
ముందుగా బాండీలో నాలుగు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే చాయపెసరపప్పు ను వేసి కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .
చల్లారగానే పెసర పప్పు ను మిక్సీ లో మెత్తగా పొడి చేసుకొని విడిగా ఉంచుకోవాలి. .
తర్వాత పంచదార ను కూడా మెత్తగా మిక్సీ వేసుకుని విడిగా ఉంచుకోవాలి .
తర్వాత బాండీలో నెయ్యి వేయకుండా పల్లీలను వేయించుకుని , చల్లారగానే పై పొట్టు తీసుకుని తర్వాత మిక్సీ లో మెత్తగా పొడి చేసుకుని విడిగా ఉంచుకోవాలి .
జీడిపప్పు మరియు బాదం బాండిలో రెండు స్పూన్లు నెయ్యి వేసి వేయించుకుని మిక్సీలో పొడి చేసుకోవాలి .
ఇప్పుడు ఒక బేసిన్ లో పెసరపప్పు పొడి , పల్లీల పొడి , జీడిపప్పు బాదంపొడి , పంచదార పొడి , యాలకుల పొడి మరియు కాచిన నెయ్యి వేసుకుని చేతితో బాగా కలుపు కోవాలి . ఆ తర్వాత ఉండ కట్టుకోవటానికి అవసరమైన కొద్దిగా పాలు పోసుకొని ఉండలు కట్టుకోవాలి .
ఈ ఉండల్లో పల్లీలు , జీడిపప్పు , బాదం అన్నీ కలుస్తాయి కనుక మంచి పోషక విలువలు కలిగి ఎదుగుతున్న పిల్లలకు మంచి బలవర్ధకమైనవి .
అంతే సంక్రాంతి స్పెషల్ పెసరపప్పు మరియు పల్లీ పప్పుతో లడ్డూలు సిద్ధం .
0 comments:
Post a Comment