ఆలూరుకృష్ణప్రసాదు .
వెజిటబుల్ రైస్.
కావలసినవి .
బియ్యము -- ఒక గ్లాసు .
క్యారెట్లు -- 2
క్యాప్సికమ్ -- 2
ఉల్లిపాయలు -- 2
బీన్స్ -- 100 గ్రాములు. చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
నెయ్యి -- మూడు స్పూన్లు .
జీడిపప్పు -- 10
పొడికి .
నెయ్యి -- రెండు స్పూన్లు .
ఎండుమిర్చి - 5
మినపప్పు -- స్పూను
శనగపప్పు -- స్పూను
వేరు శనగ గుళ్ళు - రెండు స్పూన్లు
నువ్వుపప్పు -- రెండు స్పూన్లు
ఎండు కొబ్బరి -- పావు చిప్ప చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ఉప్పు -- తగినంత
స్టౌ మీద బాండీ పెట్టి నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు వేయించుకుని విడిగా తీసి ఉంచుకోవాలి .
తర్వాత పై దినుసులన్నీ వేసి వేయించుకుని , సరిపడా ఉప్పు వేసి మిక్సీ లో మరీ మెత్తగా కాకుండా పొడి కొట్టుకుని ఉంచుకోవాలి .
తయారీ విధానము .
ముందుగా గ్లాసు బియ్యము సరిపడా
నీళ్ళు పోసి కుక్కర్ లో పొడిగా వండుకోవాలి .
వెజిటబుల్స్ అన్నీ చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే , ముందుగా ఉల్లిపాయలు , క్యారెట్ ముక్కలు , క్యాప్సికమ్ ముక్కలు , బీన్స్ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పువేసి మూతపెట్టి ముక్కలను పది నిముషాలు మెత్తగా మగ్గ నివ్వాలి.
తర్వాత అందులో ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న అన్నం వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి .
ఇప్పుడు సిద్ధంగా ఉంచుకున్న పొడి నాలుగు స్పూన్లు వేసుకుని మరో మూడు స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకుని పైన నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకుని వేరే డిష్ లోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ రైస్ సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment