ఆలూరుకృష్ణప్రసాదు .
వంకాయ కాల్చి పెరుగు పచ్చడి .
తయారీ విధానము .
మూడు గుండ్రని వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకుని వాటిపై నూనె రాసుకుని స్టౌ మీద సిమ్ సెగలో అన్ని వైపులా కాల్చుకోవాలి .
చల్లారగానే తడి చేయి చేసుకుని వాటిపై పొట్టు తీసుకుని వేరే ప్లేటులో విడిగా ఉంచుకోవాలి .
ఒక గిన్నెలో అర లీటరు పెరుగు వేసుకుని నాలుగు పచ్చి మిరపకాయలు ముక్కలుగా తరిగి పెరుగులో వేసుకోవాలి .
ఒక కట్ట కొత్తిమీర తరుగుకుని అందులో వేసుకోవాలి .
కొద్దిగా పసుపు మరియు సరిపడా ఉప్పు పెరుగులో వేసుకోవాలి .
ఇప్పుడు కాల్చి తొక్కు తీసి విడిగా ఉంచుకున్న వంకాయలు కూడా వేసుకుని చేతితో పెరుగులో బాగా కలుపుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని , నెయ్యి బాగా కాగగానే మూడు ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకుని గరిటతో బాగా కలుపుకోవాలి ,
అంతే ఎంతో రుచిగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి భోజనము లోకి సిద్ధం.
0 comments:
Post a Comment