లేత మునగాకు తో పప్పు .
ఆలూరి కృష్ణ ప్రసాద్
ఆషాఢ మాసం తప్పనిసరిగా మునగాకు ఒక్కసారైనా తినాలని పెద్దలు అంటారు .
కారణం మునగాకు లో కడుపు లోని క్రిముల్ని నశింప చేసే శక్తి ఉందని చెప్తారు .
కాని లేత మునగాకు దొరికినప్పుడు దానితో పప్ఫు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది .
కావలసినవి.
లేత మునగాకు -- షుమారు 200 గ్రా .
కందిపప్పు -- ఒక గ్లాసు
చింతపండు - పెద్ద ఉసిరికాయంత
పచ్చిమిర్చి - 5
కరివేపాకు -- రెండు రెమ్మలు.
పసుపు - కొద్దిగా
ఉప్పు -- తగినంత .
కారం --- స్పూను
పోపుకు .
ఎండుమిర్చి -- 3
మినపప్పు -- స్పూను
మెంతులు -- పావు స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- పావు స్పూను
ఇంగువ -- తగినంత
ముందుగా చింతపండు విడదీసి తడిపి ఉంచుకోవాలి .
మునగాకు వలిచి శుభ్రంచేసుకుని ఒకసారి కడిగి తరుక్కోవాలి .
లేత చిన్న కాడలు వేసుకోవచ్చు .
పచ్చిమిర్చి నిలువుగా తరుక్కోవాలి .
ఇప్పుడు కందిపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద ఉడకనివ్వాలి .
పప్పు మూడు వంతులు ఉడకగానే మునగాకు , పచ్చిమిర్చి , చింతపండు , కరివేపాకు , పసుపు , స్పూను కారం వేసి పూర్తిగా ఉడకనివ్వాలి
ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి గరిటతో బాగా కలుపుకొని దింపు కోవాలి .
తర్వాత పోపు గరిట లో నూనె వేసి ఎండుమిర్చి , మినపప్పు , మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసుకుని పోపు పెట్టుకోవాలి .
అంతే లేత మునగాకు తో పప్పు సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment