కాలీఫ్లవర్ , పెసరపప్పు, పచ్చి కొబ్బరి కూర.
ఆలూరి కృష్ణ ప్రసాద్
image courtesy: google |
ప్రియమిత్రులందరికీ.... ఈ రోజు మీకు మరో స్పెషల్ ఐటమ్ కాలీఫ్లవర్ , పెసరపప్పు, పచ్చి కొబ్బరి కూర.
గురించి వివరిస్తాను,
కావలసిన పదార్ధములు .
సన్నగా తరిగిన కాలీప్లవర్
ముక్కలు -- మూడు కప్పులు .
నానబెట్టిన చాయ పెసరపప్పు
---- ఒక కప్పు.
తురిమిన పచ్చి కొబ్బరి ---
ఒక కప్పు .
కరివేపాకు --- మూడు రెమ్మలు
పచ్చిమిర్చి -- మూడు
పోపు వేయుటకు కావలసినవి .
ఎండు మిర్చి -- మూడు
మినపప్పు -- రెండు స్పూన్లు
జీలకర్ర -- అర స్పూన్
ఆవాలు -- ఒక స్పూన్
నూనె --- నాలుగు స్పూన్లు
పసుపు -- కొద్దిగా
ఇంగువ -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
తయారు చేయు విధానము .
ముందుగా చాయపెసరపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి ఒక గంట సేపు నాన బెట్టి , ఆ తర్వాత నీళ్ళు వడగట్టు కోవాలి.
కాలీప్లవర్ పెద్దముక్కలుగా తుంపి
ఉప్పు కొద్దిగా వేసి చేయి చురుక్కుమనే వేడి నీళ్ళలో ఒక గిన్నెలో అరగంట ఉంచాలి.
ఏదైనా పురుగు ఉంటే బయటకు వచ్చేస్తుంది .
ఆ తర్వాత పెద్దముక్కలుగా నీళ్ళల్లో వేసిన ముక్కలను సన్నగా కట్ చేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె బాగా కాగాక ఎండు మిర్చి , మినపప్పు , ఆవాలు, జీలకర్ర , ఇంగువ , తరిగిన పచ్చి మిర్చి ,
కరివేపాకు , వేసి పోపు వేసుకోవాలి.
ఆ తర్వాత సన్నగా తరిగిన కాలీప్లవర్ ముక్కలు వేసి పది నిముషాలు మగ్గనివ్వాలి .
తర్వాత నానబెట్టిన చాయ పెసర పప్పు తగినంత ఉప్పువేసి మరో ఐదు నిముషాలు మగ్గనివ్వాలి .
ఆ తర్వాత తురిమిన పచ్చి కొబ్బరి , తగినంత ఎండు కారం వేసి మరో ఐదు నిముషాలు మగ్గనిచ్చి దింపుకోవాలి.
అంతే కాలీప్లవర్ పెసర పప్పు కొబ్బరి కూర సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment