Wednesday, May 31, 2017

పచ్ఛి కొబ్భరి శనగపప్పు కూర

పచ్ఛి కొబ్భరి శనగపప్పు కూర 
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఇంటిలో కూరలు వండడానికి ఏమీ లేనప్పుడు ఏమి వండాలో తెలియని సమయంలో ఇలా చెయ్యవచ్చు.
ఒక కప్పు శనగపప్పు బాగా కడిగి తగినన్ని నీరు పోసి స్టౌ మీద బద్ద చేతితో నలిపితే మెత్త బడేవరకు ఉడికించండి.
మెత్తగా ఉడికాక పప్పులో నీరు వార్చండి.
పచ్చి కొబ్బరి అర చిప్ప కోరుకోండి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి 
తగినంత నూనె వేసి మూడు ఎండు మిరపకాయలు తుంచి ,
ఒక స్పూన్ మినపప్పు , అర స్పూన్ జీలకర్ర , స్పూన్ ఆవాలు , కరివేపాకు , కొద్దిగా ఇంగువ వేసి ఉడికిన శనగపప్పు వేసి మగ్గాక తురుమి ఉంచుకున్న
పచ్ఛి కొబ్భరి , తగినంత ఉప్పు.,
ఎండు కారం వేసి మరో అయిదు నిముషాలు అయ్యాక దింపు కోండి .

అంతే పచ్చి శనగపప్పు , కొబ్బరి వేసిన కూర రెడీ .
ఈ కూరతో కాంబినేషన్ గా అల్లం పచ్చడి బాగుంటుంది .
**********************************************
అల్లం పచ్చడి .

తయారీ విధానము .
నిమ్మకాయంత చింతపండు అయిదు నిముషముల పాటు కొద్దిగా నీరు పోసి నానబెట్టండి.
బాండీ లో నూనె వేసి ఆరు ఎండు మిరపకాయలు ,
స్పూన్ మినపప్పు , అర స్పూన్ మెంతులు , స్పూన్ ఆవాలు , తగినంత ఇంగువ , కొద్దిగా పసుపు వేసి వేయించుకొనండి.

పోపు చల్లారాక మిక్సీలో వేయించిన ఎండు మిరపకాయలు, నాన బెట్టిన చింతపండు , బెల్లం కొద్దిగా , తగినంత ఉప్పు , అల్లం ముక్క చిన్నది పై చెక్కు తీసి వేసి మెత్తగా అయ్యాక మిగిలిన పోపు వేసి మిక్సీ వేసుకోవాలి .
అంతే నోరూరించే అల్లం పచ్చడి ఇడ్లీ , దోశె మరియు అన్నం లోకి సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి