Tuesday, May 30, 2017

పచ్చి టమోటాలు , కొబ్బరి పచ్చడి .

పచ్చి టమోటాలు , కొబ్బరి పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్

కావలసినవి .
బాగా పచ్చి టమోటాలు తయారైనవి --- ఆరు .
కొబ్బరిముక్కలు -- ఒక కొబ్బరి చిప్ప ముక్కలు తీసుకోవాలి .
పచ్చి మిర్చి --- పది .
కరివేపాకు --- మూడు రెబ్బలు
కొత్తిమీర --- ఒక కట్ట.
చింతపండు -- నిమ్మకాయంత
ఉప్పు -- తగినంత 
పసుపు -- అర స్పూను .
నూనె -- రెండు గరిటెలు .

పోపుకు కావలసినవి .
ఎండుమిర్చి -- ఆరు
ఆవాలు - స్పూను
మినపప్పు -- రెండు స్పూన్లు 
జీలకర్ర -- అర స్పూను 
ఇంగువ -- తగినంత 
మెంతులు - అర స్పూను .

తయారీ విధానము --
ముందుగా పచ్చి టమోటాలు ముక్కలుగా కోసుకోవాలి .
బాండీలో నూనె వేసుకుని నూనె కాగగానే పచ్చి టమోటాలు , పచ్చి మిర్చి ముక్కలను , కొద్దిగా ఉప్పు , పసుపు వేసి మగ్గనివ్వాలి.
ఇప్పుడు మళ్ళీ బాండీలో నూనె వేసి నేను పైన చెప్పిన పోపు పదార్ధములన్నీ వేసి , కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీలో ఎండు మిర్చి , చింతపండు , ఉప్పు , వేసి గ్రైండ్ చేయాలి. 
తరువాత పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసి గ్రైండ్ చేయాలి.
టమోటా ముక్కలు, కొత్తిమీర మిగిలిన పోపు వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి .

అంతే ఘమ ఘమ లాడే ఇంగువ వాసనతో టమోట పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి