గ్రీన్ చట్నీ.
ఆలూరి కృష్ణ ప్రసాద్
కొత్తిమీర ఒక కట్ట శుభ్రం చేసుకోవాలి.
పొదీనా ఒక కట్ట ఆకులు వలుచుకొని శుభ్రం చేసుకోవాలి .
ఉసిరికాయంత చింతపండు విడదీసి కొద్దిగా నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి.
అయిదు పచ్చి మిర్చి ముక్కలుగా తరుగు కోవాలి .
చిన్న అల్లం ముక్క చెక్కు తీసుకుని ముక్కలు గా తరిగి ఉంచుకోవాలి .
ఇప్పుడు మిక్సీలో పొదీనా ఆకులు , కొత్తిమీర , తడిపి ఉంచిన చింతపండు , తరిగిన అల్లం ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి , నెయ్యి బాగా కాగగానే రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి , స్పూను మినపప్పు , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పచ్చడిలో పోపు వేసి , మరోసారి మిక్సీ వేసుకుని పచ్చడిని వేరే Bowl లోకి తీసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే గ్రీన్ చట్నీ సర్వింగ్ కు సిద్ధం.
ఈ గ్రీన్ చట్నీ అన్నంలోకి , ఇడ్లీ , దోశెలు మరియు గారెల లోకి కూడా చాలా బాగుంటుంది .
0 comments:
Post a Comment