Tuesday, May 30, 2017

మెంతికూర పచ్చడి.

మెంతికూర పచ్చడి.
ఆలూరి కృష్ణ ప్రసాద్

తయారీ విధానము .
ముందుగా మూడు కట్టల మెంతికూర ఇసుక తగలకుండా రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
తర్వాత సన్నగా తరుగుకోవాలి.
వేళ్ళు తీసేయాలి.
స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే ఆరు ఎండుమిరపకాయలు ,
స్పూను మినపప్పు , పావు స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ వేసి పోపువేయించుకోవాలి .

మళ్ళీ బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి తరిగిన మెంతికూర విడిగా మగ్గ బెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీలో వేయించిన పోపు , కొద్దిగా చింతపండు , తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మెత్తగా మిక్సీ వేయాలి .
తర్వాత మగ్గిన మెంతికూర కూడా వేసి మరోసారి మిక్సీ వేసుకోవాలి .
అంతే మెంతికూర పచ్చడి అన్నం లోకి సర్వింగ్ కు సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి