Sunday, May 28, 2017

దొండకాయ మసాలా కూర

దొండకాయ మసాలా కూర
ఆలూరి కృష్ణ ప్రసాద్

కావలసినవి .
మసాలా పొడికి.
ఎండు మిరపకాయలు -- 12
ధనియాలు --- మూడు స్పూన్లు 
పచ్చి శనగపప్పు -- మూడు స్పూన్లు 
మినపప్పు -- ఒకటిన్నర స్పూను 
జీలకర్ర -- పావు స్పూను 
పల్లీలు -- రెండు స్పూన్లు 
నువ్వుపప్పు -- రెండు స్పూన్లు 
ఎండు కొబ్బరి -- పావు చిప్ప చిన్న ముక్కలుగా కోసుకోవాలి 
మెంతులు -- పావు స్పూను 
నూనె --- 150 గ్రా.
ఉప్పు --- తగినంత 
పసుపు -- కొద్దిగా

దొండకాయలు చిన్న సైజువి -- అర కిలో .
*******************
తయారీ విధానము .
ముందుగా మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి .
మసాలా పొడి .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె కాగగానే ముందుగా మెంతులు ఎండుమిరపకాయలు వేసి మెంతులు వేగగానే ధనియాలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , కొంచెం పసుపు , పల్లీలు , జీలకర్ర , ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేగగానే నువ్వుపప్పు కూడా వేసి వేయించి దింపు కోవాలి.
చల్లారగానే మిక్సీ లో వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత దొండకాయలు కడిగి నాలుగు పక్షాలుగా చేసుకొని కాయల్లో ఆ కారం కూరు కోవాలి .
కొంచెం పొడి చివరలో కాయల మీద వేయడానికి ఉంచుకోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన పోసి నూనె బాగా కాగగానే మసాలా కూరిన దొండ కాయలు వేసి మూత పెట్టి మీడియం సెగన కారం మాడ కుండా కాయల్ని అటూ ఇటూ మధ్య మధ్య కదుపు తుండాలి .
మసాలా కారం కాయలు మగ్గగానే మూత తీసి మిగిలిన కారం కూడా కూర లో వేసి మరో మూడు నిముషాలు కాయల్ని వేగ నివ్వాలి .

ఆ తర్వాత దింపి వేరే Bowl లోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచి కరమైన మసాలా దొండకాయ కూర సర్వింగ్ కు సిద్ధం.
ఫోటో ఓం శ్లోకం నుండి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి