చామదుంపలు ఉప్మా పోపు కూర.
ఆలూరి కృష్ణ ప్రసాద్
కావలసినవి .
చామదుంపలు --- అర కిలో
గుండ్రంగా చిన్న దుంపలు అయి ఉండాలి .
పచ్చి మిరపకాయలు --- 8
చింతపండు --- 30 గ్రాములు
కరివేపాకు --- మూడు రెమ్మలు
ఎండు కారం --- స్పూను
ఉప్పు --- తగినంత
పసుపు --- కొద్దిగా .
పోపుకు .
నూనె --- 50 గ్రాములు.
ఎండుమిర్చి -- 4
మినపప్పు --- స్పూనున్నర
శనగపప్పు --- రెండు స్పూన్లు
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ --- తగినంత
తయారీ విధానము .
ముందుగా చింతపండు విడదీసి పదిహేను నిముషముల ముందు నీళ్ళల్లో నాన బెట్టి , చిక్కగా రసం తీసుకొని విడిగా ఉంచుకోవాలి .
చామదుంపలు ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి , కుక్కర్ లో వేసి , తగినన్ని నీళ్ళు పోసి మూడు విజిల్స్ రానిచ్చి స్టౌ ఆపుకోవాలి .
తర్వాత చామ దుంపల పై తొక్కు వలుచుకోవాలి . దుంపలు మరీ పెద్దవిగా ఉంటే కాస్త పెద్ద ముక్కలుగా చాకుతో కట్ చేసుకుని ఒక పళ్ళెంలో విడిగా పెట్టుకుని దుంపల పైన కొద్దిగా పసుపు వేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె మొత్తం వేసి , నూనె కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి ముక్కలు , కరివేపాకు వేసి పోపు వేగగానే ఉడికిన చామదుంపలు పోపులో వేసి వెంటనే విడిగా తీసి ఉంచుకున్న చింతపండు రసం , సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి పులుపు , ఉప్పు మరియు కారం
దుంపలకు పట్టే విధంగా మగ్గ నివ్వాలి .
మధ్య మధ్య లో కూరను కదుపు తుండాలి .
దింపబోయే మూడు నిముషాల ముందు కూరలో పచ్చి మిర్చి కారం సరిపోని యెడల ఒక స్పూను ఎండు కారం వేసుకోవాలి .
తర్వాత కూర విడిగా ప్లేటు లోకి తీసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే చామ దుంపల ఉప్మా పోపు కూర సర్వింగ్ కు సిద్ధం.
ఇదే కూరలో చింతపండు రసానికి బదులుగా ఒక కాయ నిమ్మరసం స్టౌ ఆపాక పిండు కోవచ్చు .
స్టౌ వెలుగుతున్నప్పుడు పిండితే కూర చేదు వస్తుంది .
ఫోటో ఉమా హోమ్ టిప్స్ గూగుల్ సౌజన్యంతో
0 comments:
Post a Comment