కాప్సికమ్ పెరుగు పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్
కాప్సికమ్ లు --- మూడు
పెరుగు --- అర లీటరు
కరివేపాకు -- రెండు రెమ్మలు
కొత్తిమీర --- ఒక కట్ట
పచ్చిమిర్చి --- మూడు
నూనె --- మూడు స్పూన్లు
ఉప్పు --- తగినంత
పోపుకు కావలసినవి .
ఎండు మిర్చి -- రెండు
మినపప్పు --- స్పూను
ఆవాలు -- అర స్పూను
జీలకర్ర -- పావు స్పూను
నెయ్యి -- రెండు స్పూన్లు
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా కాప్సికమ్ ముక్కలు సన్నగా తరిగి , స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేసి నూనె బాగా కాగగానే కాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి .
పచ్చి మిర్చి మరియు కొత్తిమీర కచ్చా పచ్చాగా దంచుకోవాలి .
ఒక గిన్నెలో పెరుగు వేసి , అందులో సరిపడా ఉప్పు, కొత్తిమీర పచ్చిమిర్చి మిశ్రమం , వేయించిన కాప్సికమ్ ముక్కలు వేయాలి .
ఆ తర్వాత పోపు గరిట స్టౌ మీద పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి ఎండుమిర్చి , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేసుకుని ఆ పోపు పచ్చడిలో కలపాలి .
అంతే నేతి సువాసనతో కాప్సికమ్ పెరుగు పచ్చడి అన్నం లోకి సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment