Wednesday, May 31, 2017

మెంతి మజ్జిగ

మెంతి మజ్జిగ
ఆలూరి కృష్ణ ప్రసాద్

తయారు చేయు విధానం.
ఈ మెంతి మజ్జిగకు బాగా కాకపోయినా ఒక మాదిరి పుల్లటి
మజ్జిగ చాలా బాగుంటుంది.

ఇంటికి అతిధులు వచ్చి భోంచేసి వెళ్ళినప్పుడు చాలా మజ్జిగ మిగిలితే చక్కగా మెంతి మజ్జిగ
చేసుకోండి.
పెరుగు బాగా ఒక గిన్నెలో వేసి కవ్వంతో బాగా గిలక్కొట్టి తగినంత నీరు పోసుకోండి.
అందులో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కలపండి.
ఇప్పుడు స్టౌ మిద బాండి పెట్టి
మూడు చిన్న స్పూన్ల నెయ్యి వేయండి .నెయ్యి బాగా కాగాక
ముందుగా ఒక టీ స్పూను మెంతులు వేసి బాగా వేగ నివ్వండి.
ఆ తరువాత అందులో రెండు ఎండు మిరపకాయలు చిన్నముక్కలు గా తుంపి వేయండి
వెంటనే తగినన్ని ఆవాలు , జీలకర్ర , వాము , కరివేపాకు కూడా వేసి ఆవాలు చిటపట లాడాక
మాడనీయకుండా కమ్మని వాసన వస్తున్నప్పుడే మజ్జిగలో కలపండి.
అంతే ఘమ ఘమ లాడే మెంతి మజ్జిగ సిద్ధం.
మీ వంట గదంతా కమ్మని నెయ్యి,
వాము వాసనలతో ఘమ ఘమ
లాడి పోతుంది.
వేసవి కాలం తరచుగా భోజనం లోకే కాకుండా విడిగా కూడా తాగుతుంటే వేడి చేయదు .
అన్నట్టు మన ప్రియతమ మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారికి ఈ మెంతి మజ్జిగ అంటే చాలా ఇష్టం.
మరో విషయం ఈ మెంతి మజ్జిగ 
వేడి చెయ్యనక్కరలేదు.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి