Tuesday, May 30, 2017

బీరకాయ కూర.

బీరకాయ కూర.
ఆలూరి కృష్ణ ప్రసాద్

ఈ కూరకి లేత బీరకాయలే రుచిగా ఉంటాయి .
తయారీ విధానము .
నాలుగు లేత బీర కాయలు పై చెక్కు తీసుకొని , చేదు ఉందో లేదో చూసుకుని ముక్కలుగా తరుగు కోవాలి .
చాలా కొద్దిగా ఉప్పు వేసి ముక్కలు పిండుకోవాలి .
మరీ ఎక్కువ పిండ వద్దు .
పిండిన నీరు తీసేయండి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే మూడు ఎండుమిరప కాయల ముక్కలు , స్పూనున్నర మినపప్పు , పావు స్పూను జీలకర్ర , పావు స్పూను ఆవాలు , కరివేపాకు వేసి పొపు వేగగానే పిండిన బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గ నివ్వాలి .
ముక్కలు మగ్గగానే చాలా కొంచెం పావు స్పూను లో సగం ఉప్పు వేసి దింపుకోవాలి .
ఈ కూర మూడు ఏళ్ళ లోపు చిన్న పిల్లలకు , పధ్యం వారికి పెట్ట వచ్చు.
ఇలా కారం వేయకుండా ఇష్టపడే వాళ్ళకు కూడా రుచిగా ఉంటుంది .
ఈ కూరలో ఇంక కారం కాని , ఉల్లిపాయలు కాని , టమోటోలు కాని వేయనక్కరలేదు .
స్వతహాగా బీరకాయలో ఉన్న తీపితో కారం వేయం కనుక తియ్యగా ఉంటుంది.
అయితే ఈ కూర ఆటు రాదు .
అందరికీ రావాలంటే దింప బోయే ముందు ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే అందరికీ సరి పోతుంది.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి