Thursday, May 25, 2017

పల్లీల పొడి .

పల్లీల పొడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్
కావలసినవి .
పల్లీలు ముందు నూనె వేయకుండా బాండీలో వేయించి
చల్లారగానే పై పొట్టు తీసుకొని ఉంచు కోవాలి .
పల్లీలు -- ఒక కప్పు
ఎండు కొబ్బరి -- ఒక చిప్ప
ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కోరాముతో తురుము కోవాలి .
ఎండుమిరపకాయలు -- 15
జీలకర్ర -- ఒకటిన్నర స్పూను
ధనియాలు --- అయిదు స్పూన్లు .
తయారీ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టి బాండీ బాగా వేడెక్కగానే , నూనె వేయకుండా ముందుగా ఎండుమిరపకాయలు , ధనియాలు , జీలకర్ర , ఎండుకొబ్బరి తురుము వేసి బాగా వేయించుకోవాలి .
తర్వాత అందులో వేయించిన పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి .
చల్లారగానే ఈ మిశ్రమమంతా ఒకేసారి మిక్సీలో వేసి , తగినంత ఉప్పువేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే పల్లీల పొడి దోశెలలోకి మరియు అన్నం లోకి సిద్ధం.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని , ఈ పల్లీల పొడి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది .
ఇందులో చింతపండు , బెల్లం వేయనక్కరలేదు .
వెల్లుల్లి ఇష్టమైన వారు ఓ పది వెల్లుల్లి రేకలు పొట్టు తీయకుండా ఆఖరున మిక్సీ లో వేసుకుని మరోసారి మిక్సీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది .
ఈ ఫోటో ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో చేసిన పల్లీల పొడి కి సంబంధించినది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి