Tuesday, May 30, 2017

నిమ్మకాయ పప్పు .

నిమ్మకాయ పప్పు .
ఆలూరి కృష్ణ ప్రసాద్

బ్రహ్మచారి వంటలు . - అంటే ఎక్కువ Process లేకుండా సులువుగా అయ్యే వంటలు .
ఉద్యోగాలు చేసుకుంటూ అరగంట లో వంట పూర్తి చేసుకొని duty కు పరుగులు పెట్టాల్సిన యువతీ యువకులు 90 శాతం మంది పైగా కుక్కర్ ను ఉపయోగిస్తున్నారు .
చాదస్తంగా ఇత్తడి గిన్నెలో చేసుకోవాలి , ఈ వస్తువు లేదు అనుకుంటే కుదరదు .
ఉన్న దాంట్లో గబగబా చేసుకుని ఉద్యోగాలకు పరిగెత్తాలి .
తయారీ విధానము .
ఒక కప్పు కందిపప్పు ఒకసారి కడిగి తగినన్ని నీళ్ళు పోసి అందు లో నాలుగు పచ్చిమిర్చి ముక్కలు గా తరిగి వేయండి .
కాస్త కరివేపాకు కూడా వేసుకోండి.
కొద్దిగా పసుపు వేయండి .
ఉప్పు వేయవద్దు .
కుక్కర్ మూడు విజిల్స్ రాగానే స్టౌ ఆపేయండి.
రెండు నిమ్మకాయలు కోసి రసం తీసి ఉడికిన పప్పులో వేయండి.
తగినంత ఉప్పు వేయండి .
స్టౌ మీద పోపు గరిటె పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి రెండు ఎండుమిర్చి , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి పోపు వేసుకోండి .
గరిటతో బాగా కలుపుకోండి .
సులువుగా తయారయ్యే నిమ్మకాయ పప్పు సిద్ధం.
ఇదే పద్ధతిలో కందిపప్పు బదులుగా చాయపెసరపప్పు తో కూడా చేసుకోవచ్చు .
అలా కూడా చాలా బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి