Wednesday, May 31, 2017

క్యాబేజి పచ్చడి .

క్యాబేజి పచ్చడి .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తయారీ విధానము .
క్యాబేజి సగం ముక్క షుమారు 200 గ్రా . తీసుకొని సన్నగా తరుగు కోవాలి .
ఆరు పచ్చిమిర్చి , తరిగిన క్యాబేజి మూడు స్పూన్లు నూనె బాండిలో వేసి తరిగిన క్యాబేజి పచ్చి మిర్చి వేసి బాగా మగ్గ నివ్వాలి . అందులో కొద్దిగా పసుపు వేసి వేరే పళ్ళెం లోకి తీసుకోవాలి .
ఉసిరి కాయంత చింతపండు విడదీసి నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా మూడు ఎండుమిర్చి , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేయించు కోవాలి .
ఇప్పుడు మిక్సీలో ఎండుమిర్చి , చింతపండు , తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ వేసుకోవాలి .
తర్వాత వేగిన క్యాబేజి పచ్చి మిర్చి వేసి తిరిగి మిక్సీ వేసుకోవాలి .
చివరగా తరిగిన కొత్తిమీర మరియు పోపు కూడా వేసుకొని మరోసారి మిక్సీ వేసుకుని వేరే Dish లోకి తీసుకోవాలి .
అంతే క్యాబేజి పచ్చడి అన్నం లోకి రెడీ ,

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి