Tuesday, May 30, 2017

కొబ్బరి పచ్చడి .

కొబ్బరి పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్

మేము అన్నం లోకి తయారు చేసుకునే కొబ్బరి పచ్చడి .
కావలసినవి .
కొబ్బరి కాయ -- 1
ఎండుమిరపకాయలు -- 10
చాయమినపప్పు -- స్పూను న్నర
ఆవాలు -- అర స్పూను
మెంతులు -- పావు స్పూను .
జీలకర్ర -- పావు స్పూను 
ఇంగువ - కొద్దిగా 
పచ్చిమిరపకాయలు -- అయిదు 
పసుపు -- కొద్దిగా 
ఉప్పు -- తగినంత 
చింతపండు -- మూడు రెబ్బలు
బెల్లం -- కొద్దిగా . ( ఇష్టం లేని వారు మానేయండి )
నూనె -- నాలుగు స్పూన్లు .
కరివేపాకు -- మూడు రెబ్బలు.

తయారీ విధానము .
ముందుగా కొబ్బరి కాయ కొట్టి రెండు చిప్పలు కొబ్బరి కోరాముతో తురుముకుని వేరే ప్లేటు లో పెట్టుకోవాలి .
దానిపై కొద్దిగా పసుపు వేసుకోవాలి .
స్టౌ మీద బాండి పెట్టి నూనె వేసి నూనె కాగగానే ,
ముందుగా మెంతులు , ఎండు మిరపకాయలు , చాయ మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి .

ఆ వేడి పోపులో పచ్చిమిరపకాయలు కూడా వేసి స్టౌ ఆపాలి.
చింతపండు కొద్దిగా తడిపి ఉంచుకోవాలి .
రసం తీయవద్దు.

ఇప్పుడు మిక్సీలో ఎండు మిరపకాయలు , చింతపండు , ఉప్పు వేసి మిక్సీ వేసి , తర్వాత పచ్చి మిర్చి , మిగిలిన పోపు , పచ్చి కొబ్బరి వేసి మిక్సీ వేసుకోవాలి .
ఇష్టమైన వారు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు .
నీళ్ళు పోసి మిక్సీ వేయనక్కర లేదు .
పచ్చి కొబ్బరి కోరతాము కాబట్టి కొబ్బరి లోని తడి సరి పోతుంది .
రోటి సౌకర్యము ఉన్న వారు పొత్రము తో రుబ్బుకుంటే ఆ పచ్చడి రుచి అద్భుతం .
అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి అన్నంలోకి , దోశెల లోకి , చపాతీల లోకి సిద్ధం.
పచ్చి శనగపప్పు ఈ పచ్చడి లో మేము వేయం.
మీరు కావాలంటే వేసుకోండి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి