అరటిదూట పెసరపప్పు కూర!
కావలసినవి
అరటిదూట (చిన్నది) .. ఒకటి
పెసరపప్పు .. చిన్న అర గ్లాస్
శనగపప్పు .. ఒక చెంచా
మినపప్పు .. ఒక చెంచా
ఆవాలు .. అర చెంచా
ఎండుమిర్చి .. రెండు
జీలకర్ర .. కొంచం
కరివేపాకు .. కొంచం
నూనె .. పోపుకుసరిపడ
ఉప్పు .. రుచికి సరిపడా
తయారు చేయు విధానము
ముందుగా అరటిదూటను పై పెచ్చు తీసి చిన్న చిన్న చక్రాలలా తరిగి పీచు లేకుండా చేసి వాటిని చిన్న ముక్కలుగా తరిగి అందులో పెసరపప్పు, పసుపు వేసి ఉడికించి దానిని చిల్లులపల్లెంలో నీరు వార్చాలి.
పాన్ లో ఆయిల్ వేసి కాగాక అందులో ఎండుమిర్చి, పోపుగింజలు వేసి వేగాక కరివేపాకు, ఉడికిన దూట, పెసరపప్పు, మిశ్రమము, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి . ఉడికిన తరువాత ఒక బౌల్ లో కి తీసుకోవాలి .
ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.
0 comments:
Post a Comment