Wednesday, May 31, 2017

" మిక్సెడ్ ఆకు కూరల పప్పు "

 మిక్సెడ్ ఆకు కూరల పప్పు 
 ఆలూరి కృష్ణ ప్రసాద్


కావలసినవి
కందిపప్పు --- 150 గ్రాములు
పాలకూర ---- ఒక కట్ట
తోటకూర ---- ఒక కట్ట
గోంగూర ----- పులుపుని బట్టి పావు కట్ట లేదా అర కట్ట
పచ్చిమిర్చి --- ఐదు లేక ఆరు 
టమోటాలు --- పావు కిలో

తాలింపు దినుసులు
నూనె --- రెండు స్పూన్లు 
ఎండు మిర్చి --- మూడు
మినపప్పు --- ఒక స్పూను 
పచ్చిశనగపప్పు --- ఒక స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా

పసుపు --- కొద్దిగా
ఉప్పు ---- తగినంత 
కరివేపాకు --- మూడు రెబ్బలు

తయారు చేయు విధానము
ఆకు కూరలన్నీ శుభ్రం చేసుకుని సన్నగా తరగాలి .
ఒక గిన్నెలో కడిగిన కందిపప్పు ,
సన్నగా తరిగిన అన్ని ఆకు కూరల
తరుగు , పచ్చి మిర్చి ముక్కలు , కరివేపాకు రెబ్బలు, పసుపు వేసి టమోటా ముక్కలు వేసుకుని 
పప్పు లో తగినంత నీరు పోసి
కుక్కర్ లో మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి ఉడికిన ఆకు కూరల పప్పుని మెత్తగా మెదపాలి.
ఆ తర్వాత పైన చెప్పిన దినుసులన్నీ వేసి పోపు పెట్టుకోవాలి .
ఇతర ఆకు కూరలకు గోంగూర లేదా చుక్కకూర కలిపితే , ఆ ఆకు కూరల్లో ఉండే పులుపు
పప్పు కి సరిపోతుంది కనుక చింతపండు రసం వేయనక్కర లేదు .

కాలానుగుణంగా గోంగూర, చుక్క కూర బదులుగా పుల్లటి మామిడి కాయ ముక్కలు లేదా కొత్త చింతకాయలు ఈ ఆకు కూరల పప్పు లో వేసుకోవచ్చు .
ఈ మిక్సెడ్ ఆకు కూరల పప్పు అన్నం లోకి మరియు చపాతీలలోకి కూడా బాగుంటుంది .
పాలకూర టమోటో లు కలిపి వండితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని Comments లో కొందరు సందేహం వెలిబుచ్చారు .
అందువలన పాలకూర వేయకుండా లేదా టమోటో లు వేయకుండా చేసుకోండి .
సందేహపడుతూ చేయకూడదు కదా .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి