ఆలూరుకృష్ణప్రసాదు .
సింపుల్ గా కొబ్బరి పచ్చడి .
కావలసినవి .
కొబ్బరి కాయ -- ఒకటి
కాయను పగుల కొట్టి చిప్పల లో నుండి చాకుతో కొబ్బరి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
పచ్చి మిరపకాయలు -- 10
చింతపండు -- ఉసిరి కాయంత విడదీసి ఉంచుకోవాలి .
కొత్తిమీర -- ఒక కట్ట .
వేళ్ళు ముదురు కాడలు తీసివేసి శుభ్రంగా కడిగి వేరే ఉంచుకోవాలి .
ఉప్పు --- తగినంత
పసుపు --- చిటికెడు
పోపునకు .
నెయ్యి -- మూడు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- 3 ముక్కలు గా చేసుకోవాలి .
మినపప్పు -- స్పూను
జీలకర్ర --- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
కరివేపాకు --- రెండు రెమ్మలు
ఇంగువ --- కొద్దిగా .
తయారీ విధానము .
ముందుగా మిక్సీ లో వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు , పచ్చి మిరపకాయలు , చింతపండు రెబ్బలు , కొత్తిమీర , తగినంత ఉప్పు మరియు కొద్దిగా పసుపు వేసి పచ్చడి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి .
ఆ తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటె పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే వరుసగా ఎండు మిరపకాయలు ముక్కలు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకొని పోపు బాగా వేగగానే నూరి ఉంచుకున్న పచ్చడిలో వేసి స్పూనుతో బాగా కలుపుకోవాలి .
అంతే . కొత్తిమీర సువాసనతో ఎంతో రుచిగా ఉండి , సింపుల్ గా తయారు చేయటానికి వీలుగా , ఇడ్లీ , దోశె , రోటి , చపాతీ, వడలు మరియు భోజనము లోనికి ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
హామీ పత్రం .
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment