ఆలూరుకృష్ణప్రసాదు .
మెంతి వంకాయ కూర.
కావలసిన పదార్థములు.
చిన్నవి గుండ్రని వంకాయలు ---
అర కిలో
పచ్చి శనగపప్పు -- 30 గ్రాములు
చాయ మినపప్పు - 20 గ్రాములు .
మెంతులు --- మూడు టీ స్పూన్లు .
జీలకర్ర -- అర స్పూను
ఆవాలు -- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
ఎండు మిరపకాయలు -- 15
ఉప్పు --- తగినంత
పసుపు -- కొద్దిగా
నూనె -- 150 గ్రాములు .
తయారు చేయు విధానము .
ముందుగా స్టౌ వెలిగించి బాండి పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి
ముందుగా మెంతులు , ఎండు మిరపకాయలు , పచ్చి శనగపప్పు , చాయ మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి మెంతులు పచ్చి వాసన పోయి ,
పోపు కమ్మని వాసన వచ్చేదాకా వేయించు కోవాలి.
పోపు చల్లారిన తర్వాత మిక్సీలో ఈ పోపు , కాస్త పసుపు , తగినంత ఉప్పు వేసి కొంచెము పప్పులు పంటికి తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి .
వంకాయలు కాయలు పుచ్చులు లేకుండా చూసుకుని , శుభ్రంగా కడిగి నాలుగు పక్షాలుగా చేసుకోవాలి .
ముందుగా సిద్ధం చేసుకున్న కూర పొడి కాయల్లో కూరు కోవాలి .
చివరలో కూర దించబోయే ఐదు నిముషాలు ముందు పైన జల్లు కోవడానికి కాస్త పొడి విడిగా ఉంచుకోవాలి .
మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన నూనె అంతా పోసి నూనె బాగా కాగాక పొడి కూరిన వంకాయలు వేసి మీడియం సెగన వంకాయలు మగ్గి పొడి వేగే దాకా మధ్య మధ్యలో అట్లకాడతో తిరగవేస్తూ
కలుపుతూ ఉండాలి .
దింప బోయే అయిదు నిముషాల ముందు మిగిలిన పొడి వేసి వేగాక దించుకుని , వేరే డిష్ లోకి తీసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే మెంతి వంకాయ కూర సర్వింగ్ కు సిద్ధం.
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment