ఆలూరుకృష్ణప్రసాదు .
మధ్యాహ్నపు అల్పాహారము.
వేడి వేడి ఉల్లిపాయ పునుగులు.
ఇడ్లీ పిండి పునుగులు వేసే గంట ముందు బయట పెట్టుకోవాలి.
మూడు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టు కోవాలి .
షుమారు రెండు కప్పుల ఇడ్లీ పిండికి , అర కప్పు బియ్యపు పిండి, నానబెట్టిన పచ్చిశనగపప్పు , నాలుగు తరిగిన పచ్చిమిర్చి , రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కలు , తగినంత ఉప్పు , స్పూను కారం , నాలుగు రెమ్మలు తరిగిన కరివేపాకు , కొద్దిగా తరిగిన కొత్తిమీర , రెండు స్పూన్లు మైదా పిండి , చిటికెడు వంట సోడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి పకోడీల పిండి మాదిరిగా గట్టిగా కలుపు కోవాలి .
ఒక గంట సేపు అలాగే ఉంచాలి .
ఒక గంట తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి 200 గ్రాముల నూనె పోసి నూనె బాగా కాగగానే చేతితో కాని , స్పూను తో కాని పునుగుల్లా వేసుకుని , వేడి వేడిగా అల్లం చట్నీతో తింటే కర కర లాడుతూ బాగుంటాయి .
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment