ఆలూరుకృష్ణప్రసాదు .
మరో కొత్త వెరైటీ మజ్జిగ పులుసు .
కావలసినవి .
పెరుగు -- అర లీటరు.
పెరుగు ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని సరిపడా నీళ్ళు పోసుకుని కవ్వంతో గిలక్కొట్టుకొని మరి కొన్ని నీళ్ళు పోసుకుని ఉంచుకోవాలి .
పులుపు ఇష్టమైన వారు పుల్లని పెరుగును , కమ్మగా ఇష్టమైన వారు కమ్మని పెరుగును వాడుకోవచ్చును .
ఆనపకాయ -- ఒక ముక్క
క్యారెట్ -- రెండు
బంగాళా దుంపలు --
రెండు .
ఈ మూడు పై చెక్కు తీసుకుని ముక్కలుగా తరుగుకుని సరిపడా నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుని , వడకట్టుకుని విడిగా ఉంచుకోవాలి .
మజ్జిగ పులుసులో ముద్దకు . ( 1 )
బియ్యం -- స్పూనున్నర .
పచ్చిశనగపప్పు -- మూడు స్పూన్లు .
సరిపడా నీళ్ళు పోసి రెండు గంటలు నాన బెట్టు కోవాలి .
ముద్దకు ( 2 )
నూనె -- స్పూను .
ఎండుమిరపకాయలు - 2
మినపప్పు -- స్పూనున్నర .
స్టౌ మీద బాండీ పెట్టి స్పూను నూనె వేసి నూనె బాగా కాగగానే రెండు ఎండుమిరపకాయలు , స్పూనున్నర మినపప్పు వేసి వేయించుకుని విడిగా ఉంచుకోవాలి .
ముద్దకు ( 3)
పచ్చి కొబ్బరి -- పావు చిప్ప ( చిన్న ముక్కలుగా చేసుకోవాలి .)
అల్లం - చిన్న ముక్క.( పై చెక్కు తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి . )
పచ్చి మిరపకాయలు -- ఎనిమిది
కొత్తిమీర -- చిన్న కట్ట ఒకటి
కరివేపాకు -- రెండు రెమ్మలు .
పసుపు -- పావు స్పూను .
ఉప్పు -- తగినంత .
(1) , (2 ) & (3 )
నానబెట్టిన బియ్యం , పచ్చిశనగపప్పు , వేయించిన ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , పచ్చి కొబ్బరి ముక్కలు , పచ్చిమిరపకాయలు , అల్లం ముక్కలు , శుభ్రం చేసిన కొత్తిమీర కట్ట ఒకటి , రెండు రెమ్మలు కరివేపాకు , పావు స్పూను పసుపు మరియు సరిపడా ఉప్పు మొత్తం మిక్సీ లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఇప్పుడు సిద్ధంగా ఉంచుకున్న మజ్జిగలో ఈ ముద్దను వేసుకుని గరిటెతో బాగా కలుపు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , పావు స్పూను మెంతులు , పావు స్పూను ఆవాలు , కొంచెము ఇంగువ మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించుకుని పోపు చల్లారగానే మజ్జిగ పులుసులో వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి .
పోపు వేసాకే మజ్జిగ పులుసు వెచ్చబెట్టాలి .
లేకపోతే మజ్జిగ పులుసు విరిగి పోతుంది .
ఇప్పుడు పోపు పెట్టిన ఈ మజ్జిగ పులుసును స్టౌ మీద పెట్టి పొంగ కుండా గరిటెతో బాగా కలుపుతూ తెర్ల నివ్వాలి .
ఆ తర్వాత ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న ముక్కలు కూడా వేసి మజ్జిగ పులుసును బాగా తెర్లనివ్వాలి .
బాగా తెర్లాక పులుసును క్రిందకు దింపి, మరో చిన్న కట్ట కొత్తిమీర తరిగి వేసుకుని మూత పెట్టు కోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే ఈ కొత్త వెరైటీ మజ్జిగ పులుసు భోజనము లోకి సిద్ధం.
హామీ పత్రం .
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment