ఆలూరుకృష్ణప్రసాదు .
మరో వెరైటీ దోశెలు.
చల్ల ( మజ్జిగ ) దోశెలు.
కావలసినవి .
మజ్జిగ -- మూడు కప్పులు .
బియ్యము -- కప్పు
మినపగుళ్ళు -- ఒక గరిటెడు.
మెంతులు -- అర స్పూను .
ఉల్లి కారమునకు . ( దోశెల పైన రాయడానికి )
ఉల్లిపాయలు - రెండు ( ముక్కలుగా తరుగుకోవాలి )
ఎండుమిరపకాయలు - రెండు
పచ్చిమిర్చి -- నాలుగు
జీలకర్ర -- అర స్పూను
ఉప్పు -- తగినంత .
పసుపు -- కొద్దిగా
నూనె -- ఒక 50 గ్రాములు .
తయారీ విధానము .
ముందుగా బియ్యము , మినపగుళ్ళు నీళ్ళల్లో కడగాలి .
ఒక గిన్నెలో మజ్జిగ పోసుకుని అందులో బియ్యము , మినపగుళ్ళు , మెంతులు వేసుకుని ఒక అయిదు గంటల సేపు నానబెట్టుకోవాలి .
తర్వాత గ్రైండర్ లో వేసుకుని , కొద్దిగా ఉప్పు వేసుకుని దోశెల పిండిలా మెత్తగా వేసుకోవాలి .
రుబ్బిన పిండిని విడిగా వేరే గిన్నె లోకి తీసుకోవాలి .
తర్వాత మిక్సీ లో ఉల్లిపాయ ముక్కలు , జీలకర్ర , రెండు ఎండుమిరపకాయలు , నాలుగు పచ్చి మిరపకాయలు , కొద్దిగా పసుపు మరియు కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఈ కారాన్ని వేరేగా తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద పెనం పెట్టి పెనం వేడెక్కగానే పల్చగా దోశెలు వేసుకుని ఒక్కొక్క దోశె పైన ఒక స్పూను ఉల్లి కారం వేసుకుని అట్లకాడతో దోశె అంతా రాసి , స్పూను నూనె వేసి రెండు వైపులా బాగా కాలనివ్వాలి .
ఇలాగే అన్ని దోశెలు వేసుకోవాలి .
ఈ దోశెలు కొబ్బరి చట్నీతో చాలా రుచిగా ఉంటాయి .
సంబంధిత రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం .
0 comments:
Post a Comment