ఆలూరుకృష్ణప్రసాదు .
పునుగులు.
తయారీ విధానము .
షుమారు మూడు కప్పుల ఇడ్లీ పిండిలో తరిగిన రెండు ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి , తరిగిన నాలుగు పచ్చి మిరపకాయలు ముక్కలుగా తరిగి , తరిగిన కొత్తిమీర , తరిగిన కరివేపాకు , రెండు స్పూన్లు బియ్యపు పిండి, స్పూను బొంబాయి రవ్వ , స్పూనున్నర మైదా పిండి , స్పూను కారం , కొద్దిగా ఇంగువ , తగినంత ఉప్పు మరియు చిటికెడు వంట సోడా వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుని చేతితో బాగా కలిపి పది నిముషాల తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి పావు కె.జి . నూనె పోసి చేతితో కాని లేదా స్పూనుతో కాని చిన్న చిన్న ఉండలు వలె వేసుకుని బంగారు రంగులో కర కర లాడే విధముగా వేయించుకోవాలి.
0 comments:
Post a Comment