ఆలూరుకృష్ణప్రసాదు .
చింతకాయలు , పండు మిరపకాయల పచ్చడి.
కావలసినవి .
చింతకాయలు --- కిలో
పండు మిరపకాయలు -- అర కిలో
పసుపు -- స్పూను
ఉప్పు -- తగినంత
ముందుగా చింతకాయలను ఒకసారి కడిగి పల్చని బట్టపై పోసి ఆర నివ్వాలి .
ఆ తర్వాత చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
తర్వాత చింతకాయల ముక్కలను రోటి లో తగినంత ఉప్పు పసుపు వేసి మెత్తగా బండతో మెత్తగా దంపుకోవాలి .
ఆ తర్వాత ఈ పచ్చడిని వేరే జాడీలో పెట్టు కోవాలి .
మూడో రోజు అందులోని గింజలను తీసుకోవాలి .
పండు మిరపకాయలు కూడా స్పూను పసుపు , పావు స్పూను ఇంగువ మరియు తగినంత ఉప్పువేసి మెత్తగా మిక్సీ లో పచ్చడి మెత్తగా వేసుకుని , అందులో రెండు స్పూన్లు మెంతిపొడి వేసుకుని జాడిలో పెట్టుకుని ఉంచుకోవాలి .
మూడో రోజు గింజలను తీసిన చింతకాయల తొక్కు మరియు తొక్కుకుని సిద్ధంగా ఉంచుకున్న పండు మిరపకాయల మిశ్రమాన్ని ఒక బేసిన్ లో వేసుకుని చేతితో బాగా కలుపుకుని ఒక జాడిలోకి తీసుకోవాలి .
తర్వాత ఒక కప్పు పచ్చడి విడిగా తీసుకొని పచ్చడి చేసుకోవాలి .
కప్పు పచ్చడిలో పోపునకు .
నూనె -- ఐదు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- 8
మెంతులు -- అర స్పూను
మినపప్పు -- స్పూనున్నర
ఆవాలు -- అరస్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , ఆవాలు , ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి .
ఇప్పుడు మిక్సీ లో మొత్తం పోపు వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత చింతకాయ పండు మిరపకాయల పచ్చడి వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
నూరిన పచ్చడి పది రోజులు నిల్వ ఉంటుంది .
నూరకుండా ఉంచిన పచ్చడి ఒక సీసాలో భద్రపరుచుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే పూర్తిగా ఏడాది నిల్వ ఉంటుంది .
అంతే ఇడ్లీ , దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి ఎంతో రుచిగా ఉండే చింతకాయ పండు మిరపకాయల పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment