అరటి కాయ బంగాళదుంప వడలు .
ఆలూరు కృష్ణప్రసాదు
అరటికాయలు -- రెండు
బంగాళాదుంపలు -- రెండు
పచ్చిమిరపకాయలు -- 5 చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
కారం -- స్పూను
ఉప్పు -- తగినంత
తరిగిన కరివేపాకు -- పావు కప్పు
జీలకర్ర -- పావు స్పూను
అల్లం -- కొద్దిగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
బియ్యపు పిండి -- అర కప్పు.
తయారీ విధానము .
ముందుగా అరటి కాయలు నీళ్ళలో అడ్డంగా సగానికి చెక్కు తీయకుండా తరగాలి .
బంగాళాదుంప లు కూడా అలాగే తరగాలి .
ఈ రెండు ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి ఉడకనివ్వాలి .
ఆ తర్వాత చల్లారగానే నీళ్ళు వార్చుకుని చెక్కు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని అందులో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి , జీలకర్ర ,తరిగిన పచ్చిమిర్చి , తరిగిన కరివేపాకు , అల్లం ముక్కలు , బియ్యపు పిండి , కారం , ఉప్పు వేసి అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకుని వడలు వేసుకొనుటకు వీలుగా కలుపుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి అర కిలో నూనె వేసి నూనె బాగా కాగగానే చేతితో చిన్న చిన్న వడలుగా చేసుకుని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి .
అంతే వేడి వేడి అరటి కాయ మరియు బంగాళా దుంప వడలు మధ్యాహ్నము అల్పాహారమునకు సిద్ధం .
0 comments:
Post a Comment