వంకాయ కొత్తిమీర కారం
ఆలూరు కృష్ణప్రసాదు .
సింపుల్ గా గుత్తి వంకాయ కొత్తిమీర కారం.
కావలసినవి .
లేత వంకాయలు -- అర కిలో
కొత్తిమీర --- చిన్న కట్టలు 4
పచ్చిమిర్చి -- 10
ఉప్పు -- తగినంత
నూనె --- 150 గ్రాములు .
తయారీ విధానము .
ముందుగా కొత్తిమీర బాగుచేసుకుని , పచ్చిమిర్చి , సరిపడా ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా వేసుకోవాలి .
వంకాయలు నీళ్ళలో వేసుకుని నాలుగు పక్షాలుగా చేసుకోవాలి .
ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీర కారం ముద్ద ఈ కాయల్లో కూరుకోవాలి .
కొద్దిగా కారం విడిగా ఉంచుకోవాలి .
స్టౌ మీద ఒక గిన్నె పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే , ముద్ద కూరిన వంకాయలు అందులో వేసి గిన్నె పైన నీళ్ళ గిన్నె మూత పెట్టాలి .
స్టౌ మీడియం సెగలో పెట్టాలి .
మధ్య మధ్య కాయలు చితకకుండా
అట్లకాడతో కదుపుతూ ఉండాలి .
లేదా రెండు వైపులా గుడ్డతో గిన్నెను పట్టుకొని కుదిలిస్తూ ఉండాలి .
కాయలు బాగా మగ్గాక విడిగా ఉంచుకున్న కారం వేసి మూత తీసి కారం వేగనివ్వాలి .
మరో అయిదు నిముషాలు ఉంచి దింపి వేరే Dish లోకి తీసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే కొత్తిమీర సువాసనతో గుత్తి వంకాయ కొత్తిమీర కారం కూర సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment