పెసర పొడి .
ఆలూరు కృష్ణప్రసాదు .
ఒక గ్లాసు చాయ పెసరపప్పు ఒకసారి ఎండలో పెట్టండి లేదా నూనె వేయకుండా బాండీలో పచ్చి వాసన పోయే దాకా వేయించుకోండి .
స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా పన్నెండు ఎండు మిరపకాయలు , స్పూను జీలకర్ర , వేయించుకోండి .
ఇప్పుడు మిక్సీ లో పెసర పప్పు , వేయించిన ఎండుమిరపకాయలు , జీలకర్ర , పావు స్పూను కు తక్కువగా ఇంగువ మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా పొడి వేసుకోండి .
ఒక సీసాలో భద్ర పరుచుకోండి .
అన్నం లోకి , ఇష్టమైతే ఇడ్లీ మరియు దోశెలలోకి పెసర పొడి బాగుంటుంది .
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పెసర పొడిని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment