వేరుశనగ ఉండలు .
తయారీ విధానము .
అర కిలో పల్లీలు బాండీలో నూనె లేకుండా వేయించుకొని చల్లారగానే శుభ్రంగా పై పొట్టు చెరుగు కోవాలి .
ఇప్పుడు 350 గ్రాముల బెల్లం తీసుకొని దాన్ని మెత్తని పొడిగా చేసుకోవాలి .
ఆ పొడిని ఒక మందపాటి గిన్నెలో వేసుకుని అందులో పావు గ్లాసుకు తక్కువగా నీళ్ళు పోసుకుని స్టౌ వెలిగించి స్టౌ మీద పెట్టి గరిటతో కలుపుతూ బాగా ఉండ పాకం రానిచ్చి దింపి వెంటనే వేరు శనగపప్పులు, మూడు స్పూన్లు నెయ్యి వేసి బాగా కలిపి వేడి కొద్దిగా చల్లారగానే వేడి మీదనే చేతికి నెయ్యి రాసుకుని చేతితో చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి .
0 comments:
Post a Comment