పునాస కాపు మామిడి కాయలు వస్తున్నాయి .
మామిడి కాయ పచ్చడి .
కావలసినవి .
పచ్చి మామిడి కాయలు -- 2
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
నూనె --- నాలుగు స్పూన్లు
పోపు కు .
ఎండుమిరపకాయలు -- 15
మెంతులు -- అర స్పూను .
ఆవాలు -- అర స్పూను .
ఇంగువ --- కొద్దిగా .
తయారు చేయు విధానము .
ముందుగా మామిడి కాయలు బాగా కడిగి పొడి గుడ్డతో తుడుచు కోవాలి .
తర్వాత పై చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టుకుని మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు , ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి .
ఇప్పుడు మిక్సీ లో పోపు మొత్తము, పసుపు మరియు సరిపడా ఉప్పు వేసి వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఆ తర్వాత మామిడి కాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత రెండు స్పూన్లు నూనె వేసి స్పూను మినపప్పు , పావు స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ వేయించుకుని నూరిన పచ్చడిలో కలిపి ఒక సారి మిక్సీ వేసుకుని వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
అంతే దోశెలలోకి మరియు అన్నం లోకి పుల్ల పుల్లని మామిడి కాయ పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment