చింతపండు పచ్చడి .
ఆలూరు కృష్ణప్రసాదు .
సాధారణంగా పెసరట్లు , దోశెలు , ఇడ్లీలు , గారెలు మరియు అన్నం లోకి అందరం అల్లం పచ్చడి చేసుకుంటాము .
అలాగే ఇప్పుడు మామిడి అల్లం కూడ ఇప్పుడు బాగా దొరుకుతోంది కాబట్టి చాలామంది మామిడి అల్లం పచ్చడి కూడా చేస్తారు .
ఈ రెండింటికన్నా ప్రాచీనమైన పచ్చడి చింతపండు పచ్చడి .
లోగడ పెద్ద వాళ్ళందరూ చింతపండు పచ్చడినే అన్ని సందర్భాలలోనూ చేసేవారు .
కొంచెం అటూ ఇటుగా మూడు పచ్చళ్ళ రెసిపీలు ఒకే పద్ధతి లో ఉంటాయి .
ఈ చింతపండు పచ్చడి ఫ్రిజ్ లో పెట్టక పోయినా నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది .
చింతపండు పచ్చడి తయారీ విధానము .
కావలసినవి .
చింతపండు --- పెద్ద నిమ్మ కాయంత .
పచ్చిమిరపకాయలు -- 6
పసుపు -- కొద్దిగా .
ఉప్పు --- తగినంత
బెల్లం -- చిన్న ముక్క
పోపునకు .
ఎండుమిరపకాయలు --- 12
మినపప్పు --- స్పూను
ధనియాలు --- స్పూను
మెంతులు --- పావు స్పూను
జీలకర్ర --- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా
నూనె --- నాలుగు స్పూన్లు
తయారీ విధానము .
ముందుగా చింతపండు విడదీసి పావు గ్లాసు వేడి వేడి నీటీలో తడిపి ఉంచుకోవాలి .
రసం తీయనవసరం లేదు .
ఆ తర్వాత స్టౌ మీద బాండి పెట్టి నూనె మొత్తము వేసి నూనె మొత్తం వేసి నూనె బాగా కాగగానే వరుసగా మెంతులు , ఎండుమిరపకాయలు వేయాలి . మెంతులు వేగగానే మినపప్పు , ధనియాలు , జీలకర్ర , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు వేగగానే పచ్చిమిరపకాయలు కూడా వేసి కొద్ది సేపు ఉంచి స్టౌ ఆపివేయాలి .
పోపు చల్లారగానే మిక్సీ లో ముందుగా ఎండుమిరపకాయలు , పసుపు , ఉప్పువేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఆ తర్వాత తడిపిన చింతపండు కొద్ది నీళ్ళతో సహా , వేగిన పోపు పచ్చిమిరపకాయలు మరియు చిన్న బెల్లం ముక్కతో సహా వేసి మిక్సీ వేసుకోవాలి .
మేము కొద్దిగా నీళ్ళు కలిపి పల్చగా వేసుకున్నాము దోశెలలోకి .
మీరు కాస్త గట్టిగా నీళ్ళు పోయకుండా గట్టిగా తీసుకోండి .
అంతే ఇడ్లీ , దోశెలు , పెసరట్లు , గారెలు మరియు అన్నం లోకి కూడా ఎం తో రుచిగా ఉండే చింతపండు పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment