Sunday, July 2, 2017

వెల్లుల్లి కారం

ఆరోగ్యానికి   వెల్లుల్లి  కారం .

వెల్లుల్లి  ఇష్టపడే  వారు  అప్పుడప్పుడు   అంటే  సీజన్  మారినప్పుడు  తింటే  పొట్ట  శుభ్రపడి  తేలికగా   ఉంటుంది .
వెల్లుల్లి  కారం తయారీ  విధానము .

కావలసినవి  .
ఎండుమిరపకాయలు  --  15  
పొట్టు  మినపప్పు  లేదా
చాయమినపప్పు   --   రెండు స్పూన్లు .
జీలకర్ర  --  పావు  స్పూనులో  సగం .
ధనియాలు  --  నాలుగు  స్పూన్లు .
కరివేపాకు  --  పావు కప్పు 
చింతపండు  --  నిమ్మ కాయంత .
ఉప్పు  --  తగినంత .
నూనె  --  మూడు  స్పూన్లు 
వెల్లుల్లి  రెబ్బలు  --  20  పొట్టు  తీయకుండా  రేకలు  విడదీసుకోవాలి .

తయారీ  విధానము  .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా  ఎండు  మిర్చి , మినపప్పు  , ధనియాలు , జీలకర్ర  ,   కరివేపాకు  వేసి  బాగా  కమ్మని   వాసన  వచ్చేదాకా   వేయించు కోవాలి .
చల్లారగానే  మిక్సీ   వేగిన  వన్నీ   చింతపండు   విడదీసి  మరియు  తగినంత  ఉప్పు వేసి  కొంచెం   మెత్తగా మిక్సీ  వేసుకోవాలి .

చివరలో  వెల్లుల్లి   రెబ్బలు  వేసి  మరోసారి   మిక్సీ   వేసుకోవాలి .
తర్వాత  ఒక  పళ్ళెంలో  వేసుకుని   చేతితో  బాగా  కలుపుకుని  ఒక  సీసాలో  భద్ర పరుచు కోవాలి .
ఈ  పొడిని  వేడి వేడి  అన్నంలో  మరి కాస్త  నెయ్యి  వేసుకుని  మొదట  తినాలి .
ఆరోగ్యానికి  ఎంతో  మంచిది .
వెల్లుల్లి   ఇష్టపడని  వారు  మరి కాస్త  ధనియాలు , కరివేపాకు  , జీలకర్ర  పోపులో  వేసుకుని   పొడి  కొట్టుకోవచ్చును .

1 comments:

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి