Monday, July 17, 2017

ఆరోగ్యానికి మునగ

ఆరోగ్యానికి మునగ
ఆలూరు కృష్ణప్రసాదు .


మునగ ఆకు  మరియు  మునగ కాడలు  ఆహారంలో  ఉపయోగించడం వలన  లభించే  ఆరోగ్య పరమైన  ఉపయోగాలు  ఎన్నో  ?  ఎన్నెన్నో  ?
మీరే  చదవండి.
మునగ  ఆకు  ఈ  ఆషాఢ మాసంలో  లేతగా  చిగురులు  వస్తూ  ఉంది .  బాగా  దొరుకుతోంది .
ఆరోగ్య పరంగా  ఎంతో  మేలు  చేసే  ఈ  మునగాకు  గ్రీష్మ  ఋతువు  నుండి  వర్ష  ఋతువు  కు  మారుతున్న  ఈ సమయంలో  పప్పు  గాను , పప్పు కూర  గాను  లేక  ఆకు    కూర పులుసు గాను  ఆహారం  లోకి  ఏదో  విధంగా  తీసుకున్న యెడల  చాలా వరకు  అనారోగ్య  సమస్యలనుండి  కాపాడుకోగలుగుతాము .
అదే  విధంగా  మునగ  కాడలు  మనకు  దాదాపుగా  సంవత్సరం  అంతా  లభిస్తూనే  ఉంటాయి .

ఈ  మునగ  కాడలను  తరుచుగా  అనగా  వారానికి   రెండుసార్లు   ఆహారంలో  కూర గా కాని , పులుసు లో కాని , పప్పులుసు లో గాని లేదా సాంబారు లో కాని తీసుకున్న యెడల  అనేక  అనారోగ్య   సమస్యలను  దూరం  చేసుకోవచ్చు .
జలుబు మరియు  దగ్గులు రాకుండా , నరములకు సంబంధించిన సమస్యలకు , ఎముకలు  థృఢంగా  ఉండటానికి , ఆడవారు  గర్భవతి యైన  సమయంలో  మరియు  పిల్లలకు  పాలు ఇచ్చే సమయంలో  వచ్చే  సమస్యలను , శారీరక  రుగ్మతలను , అజీర్తి  సమస్యలను, ఊపిరితిత్తుల కు సంబంధించిన  సమస్యలను ,ఐరన్  లోపము  ఉన్న వారికి   బ్రహ్మాండమైన   ఔషధముగా , చర్మమునకు  మెరుగైన  కాంతి కొరకు , సంసారిక  బలహీనతల సమస్యలకు , ఎదుగుతున్న పిల్లలకు  ఒక ఔషధముగా , మూత్ర సంబంధమైన  అన్ని  సమస్యలకు ,  కాన్సర్  నుండి  రక్షణకు ,  కడుపులో  అల్సర్ మరియు  ట్యూమర్  వంటివి రాకుండా , కంటి  చూపు  మెరుగు పడుటకు , స్త్రీల  ఋతుక్రమము ను క్రమ  బద్ధము చేయుటకు , గర్భంలో ని  ఫ్ఫైబ్రాయిడ్స్  రాకుండా , ఆస్మాను తగ్గించుటకు ,  బ్రాంకైటీస్  మరియు  ట్యూబర్ క్యులోసిస్  వంటి  జబ్బుల నుండి  రక్షణకు ,  షుగర్ లెవెల్స్  కంట్రోల్  చేయడానికి , తలకు  సంబంధించిన   వ్యాధులను  నిరోధించడానికి,  మూత్రం లో  రాళ్ళు  ఏర్పడకుండా  కాపాడటానికి  ఈ విధంగా  అనేక  సమస్యలను   దరిచేరనివ్వకుండా  ఈ  మునగ కాయలు  కాపాడతాయి .
నాటు  మునగ కాయలు  ప్రాశస్త్యం  కనుక  మార్కెట్లో  లభించిన  పక్షంలో  నాటు  ములక్కాయలే  వాడండి .
లభించని  యెడల  హైబ్రిడ్   మునగ కాయలు  అయినా  కనీసం  వారానికి   రెండుసార్లు  ఆహారంలో  ఏదో  ఒక రూపంలో  ఉపయోగించండి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి