Tuesday, July 4, 2017

కాకరకాయ ఉల్లికారం

కాకరకాయ  ఉల్లికారం . 
                                                                            ఆలూరు కృష్ణప్రసాదు .

రెండు ఉల్లిపాయలు  తరిగిన  ముక్కలు , రెండు  స్పూన్లు  కారం   మరియు సరిపడా  ఉప్పు వేసి  మిక్సీ  లో   మెత్తగా   వేసుకోవాలి .
స్టౌ మీద  బాండి  పెట్టి  ఆరు  స్పూన్లు   నూనె  వేసి  ఈ  మిశ్రమాన్ని   పచ్చి వాసన  పోయే దాకా  బాగా  వేయించుకోవాలి  .
పావు కిలో చిన్న  చిన్న  కాకరకాయలు తీసుకుని  మధ్యలో నిలువుగా   గాటు  పెట్టుకోవాలి .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  ఒక  నూట యాభై  గ్రాముల  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   ఈ  కాకరకాయ లను  బాగా  వేయించుకోవాలి  .
చల్లారగానే  సిద్ధంగా   వేయించి  ఉంచుకున్న  ఉల్లి కారాన్ని  ఒక్కొక్క   కాయలో  కూరుకోవాలి .
అంతే  కాకరకాయ   కాయల పళంగా  ఉల్లికారం  కూర  సర్వింగ్  కు  సిద్థం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి