Monday, July 10, 2017

వెలగపండు పచ్చడి

వెలగపండు పచ్చడి
ఆలూరుకృష్ణప్రసాదు .

వెలగపండు  పచ్చడి  తయారీ  విధానము .
వెలగపండు  కొంచెం   బీటు  ఇచ్చేటట్లుగా  కొట్టు  కోవాలి 
రెండు  ముక్కలుగా   చేయకూడదు 
తయారైన   వెలగపండునే  తీసుకోవాలి .
తయారుకాని  పండు  పచ్చడి చేస్తే వగరుగా ఉంటుంది .
బాగా  తయారైన  పండు  వాసన  వస్తుంది.
అయినా  పచ్చడికి  బాగానే  ఉంటుంది .

ఇప్పుడు  స్టౌ  వెలిగించి  సెగ  సిమ్ లో పెట్టి  కాయను  అన్ని  వైపులా  కాల్చు  కోవాలి .
బీటివ్వకుండా  డైరెక్టుగా  స్టౌ  మీద  పెడితే  కాయ  పగిలి పోయే  ప్రమాదం  ఉంది .
చల్లారగానే  రెండు  ముక్కలు గా  చేసుకుని   స్పూను తో  అందులోని  గుజ్జునంతా  తీసుకుని  కాస్త పసుపు  గుజ్జు  పై  వేసి   వేరే  పళ్ళెంలో  పెట్టు కోవాలి .
ఇప్పుడు  స్టౌ  వెలిగించి బాండి పెట్టి   మూడు  స్పూన్లు   నూనె వేసి , నూనె  బాగా  కాగాక  నాలుగు  ఎండు మిరపకాయలు  , పావు స్పూను  మెంతులు ,  స్పూను  మినపప్పు  , పావు స్పూను  ఆవాలు ,  కొంచెం   ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  ఈ పోపు సామగ్రి   మరియు  తగినంత  ఉప్పు వేసి అంతా  మిక్సీలొ  వేసి  పొడిగా  చేసి , తదుపరి  ఐదు పచ్చిమిరపకాయలు   వేసి  మిక్సీ వేసుకోవాలి .
ఆ తర్వాత  వెలగపండు  గుజ్జు  , మరి  కాస్త ఎక్కువగా   కొత్తిమీర   వేసి  మెత్తగా   మిక్సీ  వేసుకుని   వేరే  బౌల్  లోకి  తీసుకోవాలి .
తీపి ఇష్టమైనవారు  కొద్దిగా  బెల్లం  వేసుకోండి .
అంతే  అందరూ  ఎంతగానో   ఇష్టపడే  వెలక్కాయ  పచ్చడి  భోజనము లో  సర్వింగ్  కు  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి